Begin typing your search above and press return to search.

అయ్యన్నకు ప్రత్యర్ధి ఫిక్స్?... రసవత్తర పోరు కన్ఫాం!

దీంతో ఇది అయ్యన్నకు కాస్త బ్యాడ్ న్యూస్ లాంటిదే అని అంటున్నారు పరిశీలకులు

By:  Tupaki Desk   |   31 Dec 2023 5:21 AM GMT
అయ్యన్నకు ప్రత్యర్ధి ఫిక్స్?... రసవత్తర పోరు కన్ఫాం!
X

ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నంలో ఈ సారి ఎలగైనా గెలవాలని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేయని ప్రయత్నం అంటూ లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే కేవలం విమర్శలకు, మాటలకూ మాత్రమే జనం ఓటు వేయరనే ధైర్యంతో అధికార వైసీపీ ఉందని అంటున్నారు. ఈ సమయంలో అయ్యన్నకు ఒక బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చిందనే చర్చ స్థానికంగా బలంగా వినిపిస్తుంది.

అవును... నర్శీపట్నంలో 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పోటీకి సిద్ధంగా ఉన్నారని.. ఈ దఫా టీడీపీ టిక్కెట్ ఆయనకే ఇస్తారని అంటున్నారు. టిక్కెట్ విషయంలో ఆయన కూడా ధీమాగానే ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో దూకుడు రాజకీయం చేయడంతో ముందుండే సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కే నర్శీపట్నంలో వైసీపీ అభ్యర్ధిగా మరోమారు ఛాన్స్ ఇస్తున్నారని తెలుస్తుంది.

దీంతో ఇది అయ్యన్నకు కాస్త బ్యాడ్ న్యూస్ లాంటిదే అని అంటున్నారు పరిశీలకులు. తాజగా నర్శీపట్నంలో నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర కార్యక్రమం విజయవంతం అయింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు. నర్శీపట్నంలో వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. ఈ సమయంలో వైసీపీ కేడర్ లో ఈ సామాజిక బస్సు యాత్ర మరింత ఉత్సాహాన్నిచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.

నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ కి అయ్యన్న పాత్రుడు వ్యూహాలు అన్నీ తెలుసు అంటున్నారు స్థానికులు. వాటిని చిత్తు చేసే ప్రత్యామ్యాయ వ్యూహాలతో పెట్ల ఎపుడూ ముందుంటారని... ఇదే కాకుండా గడచిన అయిదేళ్లలో నర్శీపట్నానికి మెడికల్ కాలేజ్ తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యేగా పెట్ల సాధించారని.. ఇలాంటి ఆలోచన టీడీపీ నేతలు గతంలో ఏనాడూ చేయలేదనే చర్చ కూడా సాగుతుందని తెలుస్తుంది.

దీంతో... అయ్యన్నపాత్రుడికి పోటీగా ఉమా శంకర్ అయితేనే కరెక్ట్ గా ఉంటుందని వైసీపీ భావిస్తుందని అంటున్నారు. ఫలితంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య ఈసారి కూడా రసవత్తరమైన పోరు సాగనుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో... విశాఖ రూరల్ జిల్లాలో వైసీపీ బలంగా ఉండడం ఉమాశంకర్ కు బాగా కలిసొచ్చే అంశం అని అంటున్నారు.

కాగా... 2014లో తొలిసారి అయ్యన్న మీద పోటీ చేసిన ఉమాశంకర్ గణేష్... ఆ ఎన్నికల్లో 2,338 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో అదే అయ్యన్నపై ఏకంగా 23,366 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో పెట్ల 54.82% ఓట్లు సంపాదించుకోగా.. అయ్యన్నకు 40.41% ఓట్లు పోలయ్యాయి. అంటే... తేడా సుమారు 13.41% అన్నమాట. దీంతో ఈసారి కూడా ఎడ్జ్ వైసీపీకే ఉండొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.