Begin typing your search above and press return to search.

అలవాటైన ప్రాణం... బ్రాహ్మణి పై అయ్యన్న టంగ్ స్లిప్!

దీంతో... తన కుమార్తెను ఇలా అసభ్యకరంగా సంభోధించినందుకు బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి

By:  Tupaki Desk   |   3 Oct 2023 10:33 AM GMT
అలవాటైన ప్రాణం... బ్రాహ్మణి పై అయ్యన్న టంగ్ స్లిప్!
X

మహిళలను సంభోదించే విషయంలో నోరు జారే నేతలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రి రోజాపై అసభ్యకరంగా మాట్లాడిన బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు పట్టుకెళ్లిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా బ్రాహ్మణిపై అయ్యన్న పాత్రుడు వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... మహిళను సంభోధించే విషయంలో ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం అలవాటు అనే పేరు సంపాదించుకున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు... బ్రాహ్మణి ఎవరనే విషయంలో టంగ్ స్లిప్ అయ్యారు. టంగ్ స్లిప్.. అనేకంటే... అలవాటైన పదప్రయోగాలు చేశారు అనడం బెటరనే కామెంట్లు వినిపిస్తున్నాయి! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

వివరాళ్లోకి వెళ్తే... చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు చేపడుతున్న "సత్యమేవ జయతే" కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు... "బ్రాహ్మణి, బాలకృష్ణ రెండో కూతురు, లోకేష్ భార్య" అని సంభోదించారు. దీంతో పక్కనున్నవారు వారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. బ్రాహ్మణి.. బాలకృష్ణ పెద్ద కూతురు అని తెలిపారు!

దీంతో... "అదే పెద్ద కూతురు.. దాని పేరు ఏమి పేరు?" అని అన్నారు. ఇలా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్వయానా ఆ పార్టీ అధ్యక్షుడి కోడలి విషయంలో "దాని పేరు" అని సంబోధించిన విధానం చాలా అగౌరవంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

నిజంగా ఆయనకు మతిమరుపు ఉంటే.. లోకేష్ భార్య పేరు, చంద్రబాబు కోడలి పేరు, బాలకృష్ణ కూతురు పేరు మరిచిపోయి ఉంటే "ఆవిడ పేరు ఏమిటి"? అనో "ఆవిడది ఏమి పేరు?" అనో అడగకుండా... "దాని పేరు" అని సంభోదించడం అభ్యంతరకరమైనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మిగిలిన టీడీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా అనేది వేచి చూడాలి.

దీంతో... తన కుమార్తెను ఇలా సంభోధించినందుకు బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. ఇక లోకేష్ రియాక్షన్ పై కూడా ఆసక్తి నెలకొంది.

మరోపక్క ఈ విషయంపై రాం గోపాల్ వర్మ స్పందించారు. టీడీపీలో బండారు సత్యనారాయణ తర్వాత మరో రత్నం అయ్యన్నపాత్రుడు అంటూ రియాక్ట్ అయ్యారు. నారా బ్రాహ్మణి పేరును అయ్యన్న మరిచిపోయిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. బండారు తర్వాత నారా బ్రాహ్మణిపై మాట్లాడిన మరో టీడీపీ జెం అయ్యన్న అని వర్మ పేర్కొన్నారు.