Begin typing your search above and press return to search.

జగన్ పై దాడి... టీడీపీ, చంద్రబాబు, మోడీ టైమింగ్స్ గమనించారా?

ఈ సమయంలో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. అయితే... ఈ సమయంలో జగన్ కి జరిగిన దాడిపై టీడీపీ, చంద్రబాబు, లోకేష్ కు సంబంధించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   14 April 2024 9:06 AM GMT
జగన్  పై దాడి... టీడీపీ, చంద్రబాబు, మోడీ టైమింగ్స్  గమనించారా?
X

ఎన్నికల షెడ్యూల్ కి ముందు "సిద్ధం" అంటూ కనీవినీ ఎరుగని స్థాయిలో అన్నట్లుగా భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైఎస్ జగన్... అభ్యర్థుల ప్రకటన అనంతరం "మేమంతా సిద్ధం" అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ సాగనున్న ఈ యాత్ర శనివారం విజయవాడలో భారీ ఎత్తున జరిగింది! ఈ సమయంలో రాత్రిపూట జగన్ పై ఓ ఆగంతకుడు దాడి చేశాడు! దీంతో సీఎం ఎడమ కాంటిపైన కనుబొమ్మపై గాయం అయ్యింది.

దీంతో... ఆయన బస్సులోనే ప్రథమ చికిత్స చేయించుకున్న అనంతరం... తిరిగి బస్సు యాత్రను కంటిన్యూ చేయించారు జగన్. ఈ సమయంలో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. అయితే... ఈ సమయంలో జగన్ కి జరిగిన దాడిపై టీడీపీ, చంద్రబాబు, లోకేష్ కు సంబంధించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. పైగా... టీడీపీ వేరు, చంద్రబాబు వేరుగా స్పందించడంపై తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.

వాస్తవానికి విజయవాడలో ఏపీ సీఎం జగన్ పై దాడి శనివారం రాత్రి 8:10 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ క్రమంలో రాత్రి 9:30 నిమిషాలకు టీడీపీ.. అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఒక ట్వీట్ చేసింది. "కోడి కత్తి డ్రామాలే నీ అజెండా... వాటిని తిప్పికొట్టటమే మా అజెండా" అని స్పందించింది. అనంతరం... ఐటీడీపీ అకౌంట్ నుంచి 9:38 గంటల సమయంలో జగన్ కి తగిలిన గాయంపై మరో ట్వీట్ విడుదలయ్యింది!

ఇందులో భాగంగా... "ఎన్నికల సమయంలో మరో డ్రామాకి తెరలేపిన కోడి కత్తి కమల్ హాసన్.. ఇలాంటి నేరస్థులకి రాజ్యాధికారం ఎంత ప్రమాదమో ప్రజలు ఆలోచించాలి!" అని ట్వీట్ చేసింది ఐటీడీపీ! ఈ క్రమంలో... జగన్ కి తగిలిన గాయం ఒక డ్రామా అని అర్ధం వచ్చేలా టీడీపీ సోషల్ మీడియా టీం విపరీతంగా పోస్టులు పెట్టింది! ఇదే సమయంలో టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి 9:50 ప్రాంతంలో మరో ట్వీట్ చేసింది.

ఇందులో భాగంగా... “కోడి కత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్” అంటూ ట్వీట్ చేసింది! ఈ సందర్భంగా జగన్ కంటిపైన గాయమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ... "దెబ్బ తగిలిందని నటించబోయే ముందు.. కెమెరా ముందు నటించేటప్పుడు" అని రాస్తూ ట్వీట్ చేసింది. ఇలా ఐటీడీపీ, తెలుగుదేశం అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి జగన్ కి తగిలిన దెబ్బ ఒక డ్రామా అంటూ వరుస ట్వీట్లు నెట్టింట హల్ చల్ చేశాయి.

ఈ సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. రాత్రి 11:15 గంటల ప్రాంతంలో... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తొందరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు మోడీ. ఈ క్రమంలో... అప్పటివరకూ టీడీపీ, ఐటీడీపీ ట్విట్టర్ అకౌంట్స్ లో జగన్ పై వెటకారపు ట్వీట్లు, ఎద్దేవా వ్యాఖ్యల స్థానంలో చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా ప్రధాని మోడీ రాత్రి 11:15 కి ట్వీట్ చేయగా... వెంటనే 11:37కి స్పందించిన చంద్రబాబు... జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని, ఈ ఘటనకు కారకులైనవారికి కఠినంగా శిక్షించాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నట్లు స్పందించారు. దీంతో... ఎన్డీయేలో ఉంటూ హుందాగా వ్యవహరించకుండా.. ఇలా చిల్లర రాజకీయాలు చేయద్దు అని చంద్రబాబును మోడీ వారించినట్లున్నారంటూ నెట్టింట ప్రచారం ఊపందుకుంది!

దాడి జరిగిన వెంటనే రాజకీయాలు పక్కనపెట్టి మానవతా కోణంలో దాడిని ఖండించాలి.. కానీ.. టీడీపీ నాయకులు మాత్రం "ఇది కావాలనే వైసీపీ చేసింది" అంటూ దారుణంగా టీడీపీ అఫిషియల్, ఐటీడీపీ నుండి జగన్ మీద సోషల్ మీడియాలో దాడి చేసారనే చర్చా మొదలైంది. ఈ సమయంలో... భవిష్యత్ ఆశాకిరణంగా చెప్పే నారా లోకేష్ స్పందిస్తూ... "రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!" అని ట్వీట్ చేశారు.

దీంతో... జగన్ పై దాడి జరగడంపై మోడీ కూడా స్పందించడంతో.. ఇది ఏదో తేడా వచ్చేలా ఉంది అని వెంటనే చంద్రబాబు.. దాడిని ఖండిస్తూ ట్వీట్ వేశారనే కామెంట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి. మోడీ ట్వీట్ అనంతరం ఇక్కడే చంద్రబాబు దొరికేశారని... పార్టీ తరుపున వైసీపీ మీద దాడి చేయిస్తూ.. ఆయన వ్యక్తిగతంగా మాత్రం దాడిని ఖండిస్తున్నట్లు చేసిన ట్వీట్ ని కవరింగ్ లో భాగం అని అంటున్నారు!

ఈ విషయాన్ని మోడీ గమనించినా గమనించకపోయినా.. బీజేపీలోని పెద్దలు గమనించినా గమనించకపోయినా... ఏపీ ప్రజానికం మాత్రం గమనిస్తున్నారని చెబుతున్నారు! ఏది ఏమైనా... జగన్ కి గాయమైన విషయంలో చంద్రబాబు ఒకలా... తెలుగుదేశం పార్టీ మరోలా స్పందించడంపై నెట్టింట వెటకారం వైరల్ గా మారింది!! ఇదే సమయమలో జగన్ పై దాడి విషయంలో మోడీకి చంద్రబాబు భయపడ్డారనే చర్చా తెరపైకి వచ్చింది!