Begin typing your search above and press return to search.

మోడీని చంద్రబాబు టెర్రరిస్ట్ అన్నారు... లైన్ లోకి అసదుద్ధీన్!

ఏపీలో బీజేపీ - జనసేన కూటమిలో బీజేపీ కూడా వచ్చి చేరడం.. పోటీ చేసే సీట్ల సంఖ్యపై ఇప్పటికే క్లారిటీ రావడం తెలిసిందే

By:  Tupaki Desk   |   12 March 2024 4:30 PM GMT
మోడీని చంద్రబాబు టెర్రరిస్ట్ అన్నారు... లైన్ లోకి అసదుద్ధీన్!
X

ఏపీలో బీజేపీ - జనసేన కూటమిలో బీజేపీ కూడా వచ్చి చేరడం.. పోటీ చేసే సీట్ల సంఖ్యపై ఇప్పటికే క్లారిటీ రావడం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోపక్క ఇంతటి అవకాశవాద రాజకీయాలు.. ఇలాంటి విలువలు, స్థిరత్వం లేని రాజకీయాలు బాబుకు మాత్రమే సాధ్యమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తుపై అసదుద్ధీన్ ఒవైసీ స్పందించారు.

అవును... ఏపీలో బీజేపీ - టీడీపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిన తర్వాత 1999, 2004, 2014ల్లో బీజేపీతో పొత్తులతో బరిలోకి దిగిన నేపథ్యంలో.. మరోసారి బీజేపీని వెంటపెట్టుకుని చంద్రబాబు ఎన్నికలకు వెళ్తున్నారు! ఈ విషయంపై స్పందించిన అసదుద్ధీన్ ఓవైసీ... గతంలో మోడీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు!

ఇందులో భాగంగా... గతంలో మోడీని చంద్రబాబు టెర్రరిస్ట్ అని పిలిచారని.. ఇప్పుడేమో వారికి టీ సర్వ్ చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు! ఇక ఏపీలో ఎంఐఎం పోటీ చేసే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పిన ఆయన... వైఎస్ జగన్ తనకు మిత్రుడు అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో ముస్లింలు, క్రీస్టియన్లు, దళితులు, ఆదివాసీలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డారు.

ఇక అంతకముందు సీఏఏ పై అమల్లోకి తీసుకురావడంపై స్పందించిన ఓవైసీ... సీఏఏపై తమకున్న అభ్యంతరాలు అలానే ఉన్నాయని తెలిపారు. ఈ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్ లో పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో మతం ఆధారంగా కాకుండా.. హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వంపై ఫైరవుతూ ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

కాగా... 2014లో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన అనంతరం కొంతకాలానికి విడిపోయిన తర్వాత.. ప్రధాని మోడీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మోడీని ఉగ్రవాది అని అన్నారు! ఇదే సమయంలో మోడీలాంటి వ్యక్తి దేశంలో ఉండటానికి అనర్హుడని.. ఆయన ఏ దేశానికి వెళ్తున్నా వారు రావొద్దంటున్నారని.. ట్రిపుల్ తలాక్ అయినా చెప్పకుండానే భార్యకు విడాకులు ఇచ్చారని విమర్శించిన సంగతి తెలిసిందే!