Begin typing your search above and press return to search.

అరెస్టైన మాజీ ముఖ్యమంత్రుల లిస్ట్ ఇదే... కేజ్రీవాల్ కి అదే తేడా!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 March 2024 4:33 AM GMT
అరెస్టైన మాజీ ముఖ్యమంత్రుల లిస్ట్ ఇదే... కేజ్రీవాల్ కి అదే తేడా!!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో... తనతో మిత్రత్వంలో ఉన్నవారి విషయంలో ఒకవిధంగా.. తనతో రాజకీయ శతృత్వం ఉన్నవారి విషయంలో మరోలా వ్యవహరిస్తారనే పేరు మోడీ విషయంలో బలపడుతుందని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పటివరకూ అరెస్టైన సీఎంల జాబితా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాత్రి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు.. ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో... పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డులకెక్కారు! పైగా... జైలు నుంచే పాలన సాగిస్తారని ఆప్ వర్గాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఇలా పదవిలో ఉండగానే అరెస్టైన ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డులకెక్కగా... గతంలో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు కూడా పలు అవినీతికేసుల్లో అరెస్టయ్యారు. కాకపోతే వారు మాజీలు అయిన తర్వాత అరెస్ట్ అవ్వగా... కేజ్రీవాల్ మాత్రం సీఎం కుర్చీలో ఉండగానే అరెస్టవ్వడం గమనార్హం. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సంగతి తెలిసిందే.

2014 - 19 సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ లో పెద్ద స్కాం జరిగిందని ఏపీ సీఐడీ ఆయనను అరెస్ట్ చేయగా.. కోర్టు చంద్రబాబుకు 50రోజులకు పైగా విడతలవారీగా రిమాండ్ విధించింది. దీంతో... ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు! ఇదే క్రమంలో... బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాలు దాణా కుంభకోణం కేసులో అరెస్టయ్యారు.

ఇక.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టవ్వగా... టీచర్ల నియామకాల అవినీతి కేసులో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా అరెస్టయ్యారు. ఝార్ఖాండ్ మాజీముఖ్యమంత్రులు మధుకోడా, హేమంత్ సోరెన్ లు మైనింగ్ కేసులో అరెస్టయ్యారు. ఇలా వీరంతా మాజీలు అయిన తర్వాత పలు కేసుల్లో అరెస్టైన ముఖ్యమంత్రులుగా చేసిన నేతలు!