Begin typing your search above and press return to search.

2024 ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఏఐ చెప్పిన చిలక జోస్యం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో వాటి అంచనాల్ని చూసినప్పుడు..కొన్ని మన ఊహకు అందని అంశాలు ఉండటం గమనార్హం

By:  Tupaki Desk   |   5 Jan 2024 5:02 AM GMT
2024 ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఏఐ చెప్పిన చిలక జోస్యం
X

భవిష్యత్తు గురించి అంచనా వేయటం మొదట్నించి వస్తున్నదే. వందల ఏళ్ల తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని ముందుగా పసిగట్టిన అద్భుత జ్యోతిష్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వారికి సుపరిచితులైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకరైతే.. ప్రపంచ వ్యాప్తంగా పోతులూరి వారి తరహాలో ఉన్న మహనీయుడు నోస్ట్రడామస్. ఇక.. ఇప్పటి రోజుల్లో ఉన్న వారెందరో ఎవరికి వారికి భవిష్యత్తు ఎలా ఉంటుందన్న అంశంతో పాటు.. ప్రపంచ అంశాల్ని తరచూ చెప్పేస్తుంటారు. వీరి జ్యోతిష్యాన్ని పక్కన పెడితే.. ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చేసుకొని కృత్రిమ మేధ(అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా 2024లో టెక్నాలజీ పరంగా చోటు చేసుకునే మార్పులు ఏమిటి? సరికొత్త ఆవిష్కరణలు ఏమిటి? అన్న ప్రశ్నలను సంధిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. వాటిల్లో కొన్ని ఆందోళన కలిగించేవిగా ఉండటం గమనార్హం.

ఈ ప్రశ్నల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫాం మీద పని చేసే వివిధ సంస్తలను 2024 ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న కామన్ ప్రశ్నను అడిగినప్పుడు విభాగాల వారీగా వచ్చిన సమాచారం.. అంచనాలు టెన్షన్ పుట్టించటం ఖాయం. ఈ ప్రశ్నల్ని 'ఓపెన్ ఐఏ సంస్థ'కు చెందిన 'చాట్ జీపీటీ'.. గూగుల్ కు చెందిన 'బార్డ్'.. అమెజాన్ కు చెందిన 'క్లాడ్' ప్లాట్ ఫాంలను ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ 'డెయిలీ మొయిల్' ప్రతినిధులు ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు ఎక్కువగా తాము బార్డ్.. క్లాడ్ లను ఎంపిక చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో వాటి అంచనాల్ని చూసినప్పుడు..కొన్ని మన ఊహకు అందని అంశాలు ఉండటం గమనార్హం. క్లాడ్ ఏఐ అంచనా ప్రకారం 2024లో మనుషుల తరహాలో వివేచనతో వ్యవహరించే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ను అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది. వస్తువుల్ని గుర్తించటం.. ఆటలు ఆడటం.. భాషలకు సంబంధించిన ప్రాసెస్ లాంటి అంశాల్లో ఇప్పటికే మనుషుల కంటే మిన్నగా మెషిన్లు పని చేయటం తెలిసిందే.

ఇదే విషయాన్ని క్లాడ్ స్పష్టం చేస్తూ.. '2024లో ఏఐ ప్రోగ్రాంలు మరింత తెలివిని సంతరించుకుంటాయి' అని పేర్కొనటం గమనార్హం. గూగుల్ బార్డ్ అంచనాను చూస్తే మరింత ఆశ్చర్యానికి గురి చేసే అంచనాలు ఉన్నాయి. మనుషుల శరీరానికి యంత్రాల్ని అమర్చుకొని సమర్థంగా మారేందుకు ఈ ఏడాది వేదిక అవుతుందని పేర్కొంది.మెదడులో అమర్చే చిప్ ఆధారంగా కంప్యూటర్ కు అనుసంధానం అయ్యేలా బయోటెక్నాలజీని రూపొందిస్తారని అంచనా వేసింది.

దీంతో.. క్రిత్రిమచేతులు.. కాళ్ల లాంటి అవయువాలను.. ఇతర పరికరాలను నేరుగా మెదడుతో కంట్రోల్ చేసే వీలుందని పేర్కొంది. ఇది చదివినంతనే.. ఇవన్నీ సాధ్యమా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరాలింక్ సంస్థ.. దాని లక్ష్యాల్ని చూసినప్పుడు ఇదెంత తేలికన్న విషయం అర్థమవుతుంది. న్యూరాలింక్ ద్వారా తాము రూపొందించే బ్రెయిన్ చిప్ లను ఈ ఏడాది మనుషఉలకు ప్రయోగాత్మకంగా అమర్చి.. పరిశీలిస్తానమి ఇప్పటికే ప్రకటించటం తెలిసిందే.

అంతర్జాతీయంగా చోటు చేసుకునే రాజకీయ పరిణామాల్ని అంచనా వేసింది. క్లాడ్ అంచనా ప్రకారం అమెరికా.. చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చని.. తైవాన్.. చైనా మధ్య వివాదం మరింత ముదిరి.. తైవాన్ పూర్తి స్వాతంత్య్రాన్ని ప్రకటించే దిశగా అడుగులు వేయొచ్చని తెలిపింది. అదే జరిగితే చైనా మిలటరీతో దుందుడుకుగా వ్యవహరిస్తే దాని ప్రభావం ప్రపంచం మీద పడే వీలుందని క్లాడ్ పేర్కొంది. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకునే నేతల విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వాల ఎన్నుకునే అంశంలో ప్రజల మైండ్ సెట్ ను మార్చేలా ప్రభావితం చేయటం.. ఎన్నికల ప్రక్రియను ఏఐ సాయంతో హ్యాక్ చేయటం లాంటివి జరుగుతాయని గూగుల్ బార్డ్ లెక్కేసింది. సోషల్ మీడియాలోనూ.. బయటా ఎన్నికల ప్రచారానికి కొందరికి అనుకూలంగా.. పక్షపాతంగా ఉండేలాఓటర్లను ప్రభావితం చేసే విషయంలో ఏఐ కీలకంగా మారనుందని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్య వస్తే గతంలో మాదిరి.. మందులు జనరల్ గా ఇవ్వటం కాకుండా ఎవరికి వారికి వారి డీఎన్ఏ ఆధారంగా చికిత్స చేసే విధానం అందుబాటులోకి వస్తుంది. దీంతో.. వివిధ వ్యాధులకు ఉండే వేర్వేరు లక్షణాలకు సంబంధించి పేషెంట్ డీఎన్ఏ ఆధారంగా వైద్య చికిత్సలు పెరుగుతాయని అంచనా వేసింది. ఇదంతా చదివినప్పుడు హాలీవుడ్ మూవీలా అనిపించటం ఖాయం. ఇందులో కొన్ని ఆసక్తిని.. మరికొన్ని ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు.