Begin typing your search above and press return to search.

జగన్ వర్సెస్ బాబు : మ్యానిఫెస్టోల దాగుడుమూత !

ఏపీలో ప్రతీ విషయంలోనూ పోటా పోటీగానే ఉంది. అధికారం ఇపుడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకంగా మారుతోంది

By:  Tupaki Desk   |   12 April 2024 10:28 AM GMT
జగన్ వర్సెస్ బాబు : మ్యానిఫెస్టోల దాగుడుమూత !
X

ఏపీలో ప్రతీ విషయంలోనూ పోటా పోటీగానే ఉంది. అధికారం ఇపుడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకంగా మారుతోంది. చావో రేవో అని అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా భావిస్తున్నాయి. చమటోడుస్తున్నారు జగన్ చంద్రబాబు అన్న మాట చెప్పాలి. మండే ఎండలలో ఇద్దరూ తిరుగుతున్నారు. రోజుల తరబడి జనంలోనే ఉంటున్నారు

ఇక ప్రతీ విషయంలోనూ జగన్ చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ పోతున్నారు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలను పదును పెడుతున్నారు. ఎవరూ ఎక్కడా తగ్గేది లేదు అని చెబుతున్నారు. అభ్యర్ధులను టీడీపీ వైసీపీ ప్రకటించినా చివరి నిముషంలో మార్పులు ఉంటాయని రెండు వైపులా వినిపిస్తోంది. దానికి కారణం ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ తమ గెలుపు అవకాశాలను పెంచుకోవడం కోసమే అంటున్నారు

ఇక ఈసారి ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ఇంకా అలాగే ఉంది. అదే ఎన్నికల మ్యానిఫెస్టోల రిలీజ్. టీడీపీ కూటమిగా మేనిఫెస్టో రిలీజ్ చేయబోతోంది. వైసీపీ సోలోగానే చేయనుంది. టీడీపీ విషయానికి వస్తే గత ఏడాది రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సూపర్ సిక్స్ అని ఆరు పధకాలను ప్రకటించారు. ఆ మీదట దసరాకు ఎన్నికల మేనిఫెస్టో అన్నారు కానీ అప్పటికి ఆయన జైలులో ఉండిపోయారు.

ఇక ఆ తరువాత పొత్తులు కుదరడం చివరిలో బీజేపీ కూడా చేరడంతో అంతా కలసి ఉమ్మడి మేనిఫెస్టో తెస్తారు అని అంటున్నారు. దీని మీద తెర వెనక కసరత్తు సాగుతోందని అంటున్నారు. కూటమి పెద్దన్న టీడీపీదే మ్యానిఫేస్టో తయారీలో కూడా కీలక పాత్ర.

అయితే వైసీపీ మ్యానిఫేస్టోని ఉగాది వేళ జగన్ రిలీజ్ చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ ఉగాది వెళ్ళిపోయింది రిలీజ్ ఆగిపోయింది. దానికి కారణం ఏమిటి అంటే టీడీపీ మ్యానిఫెస్టో చూసిన తరువాతనే వైసీపీ రిలీజ్ చేస్తుందని అంటున్నారు. ఇక్కడ కూడా పోటీ అలాగే ఉందిట.

టీడీపీ సైతం వైసీపీనే ముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఆనక ఆ హామీలను అన్నీ చూసి రెట్టింపు హామీలతో తాము రిలీజ్ చేసి జనాల మనసు కొల్లగొట్టాలని భారీ ప్లాన్ లో ఉందని అంటున్నారు. దాంతోనే టీడీపీ మేనిఫెస్టో ఆలస్యం అవుతోంది. ఈసారి మ్యానిఫేస్టోలో వైసీపీ టీడీపీ రెండింటిలో కూడా సామాజిక పెన్షన్ అలాగే రైతులకు రుణ మాఫీ డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ వంటి అంశాలు ఉంటాయని అంటున్నారు.

వైసీపీ రైతు రుణమాఫీ అంటే టీడీపీ రైతు రుణమాఫీని తామూ చేస్తామని ముందుకు రావడమే కాదు దాంతో పాటుగా రైతులకు పెట్టుబడి సాయాన్ని భారీగా ఇవ్వడం ద్వారా అదనపు వరాన్ని ఇవ్వాలని అనుకుంటోందిట. అలాగే టీడీపీ సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అంటే జగన్ దాన్ని అయిదు వేల రూపాయలు చేయడానికి ఆగారని అంటున్నారు.

ఇలా పోటా పోటీగా ఎన్నికల ప్రణాళికలో కీలక హామీలను దగ్గర ఉంచుకుని చివరి నిముషంలో మార్పులతో తామే జనాలను పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడానికి రెండు పార్టీలూ చూస్తున్నాయని అంటున్నారు. దాని కోసం ప్రత్యర్ధి పార్టీ మ్యానిఫేస్టోని చూసిన మీదటనే తాము మరింత ఎక్కువ వరాలతో రిలీజ్ చేయాలని ఆగిపోతున్నారుట.

దాంతో ఎవరి మ్యానిఫేస్టో ముందు రిలీజ్ అవుతుంది అంటే చెప్పడం కష్టమని అంటున్నారు. వైసీపీ మ్యానిఫేస్టో రిలీజ్ చేస్తే చంద్రబాబు దానిని మించి అన్నట్లుగా కొత్త కలరింగ్ తో దిగిపోతారు. అలాగే జగన్ కూడా బాబుని మించిన హామీలు అంటారు. సో ఇపుడు ఈ దాగుడుమూతల మధ్యన రెండు మ్యానిఫేస్టోలూ అలా పక్కన ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ మొదట ఎవరి మ్యానిఫెస్టో రిలీజ్ అవుతుంది అంటే వెయిట్ అండ్ సీ.