Begin typing your search above and press return to search.

58 నెలలు సుఖం.. 2 నెలల్లో నరకం.. ఫస్టొచ్చింది పెన్షన్ ఎలా?

ఇలా ఎండైనా, వర్షమైనా, వరదైనా, తుఫానైనా.. ఒకటో తేదీ వచ్చిందంటే పెన్షన్ ఇంటికివద్దకే వచ్చేది.. సుమారు 58 నెలలు ఇలానే నడిచింది.

By:  Tupaki Desk   |   1 May 2024 9:31 AM GMT
58 నెలలు సుఖం.. 2 నెలల్లో నరకం.. ఫస్టొచ్చింది  పెన్షన్  ఎలా?
X

గతంలో పెన్షన్ తీసుకోవడం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు వృద్ధులు! అయితే... వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వాతాతలకు ఆ కష్టం లేకుండా చేయాలని ఫిక్సయ్యారు. అనుకున్నదే తడువుగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. వారి ద్వారా పెన్షన్ ను ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటివద్దకే పంపించేవారు. ఇలా ఎండైనా, వర్షమైనా, వరదైనా, తుఫానైనా.. ఒకటో తేదీ వచ్చిందంటే పెన్షన్ ఇంటికివద్దకే వచ్చేది.. సుమారు 58 నెలలు ఇలానే నడిచింది.

అయితే... ఎన్నికలు సమీపించగానే వాలంటీర్లతో పెన్షన్, రేషన్ వంటి సంక్షేమ పథకాలు ఇప్పించవద్దంటూ కొంతమంది ఈసీకి ఫిర్యాదు చేశారు! దీంతో... వారి సేవలకు అంతరాయం కలిగింది! అవ్వాతాతలు ప్రశాంతంగా ఇంటివద్దే కాలు కదపనవసరం లేకుండా పెన్షన్ తీసుకునే విధానానికి గ్రహణం పట్టింది! దీంతో... ఏప్రిల్ నెలలో పెన్షన్ కోసం సచివాలయాల చుట్టూ తిరిగిన పెన్షన్ దారులు నరకం చూశారు!

కట్ చేస్తే.. మే నెల ఒకటో తేదీ వచ్చేసింది. మళ్లీ అదే నరకం ప్రత్య్యక్షమైంది!! ఈ సమయంలో... "ప్రతినెలా ఒకటో తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని.. పెద్దమ్మా బాగున్నావా..? తాతా బాగున్నావా..? అని పలకరించే వాలంటీర్ ఈసారీ రాలేదు! ఆయన వచ్చి డబ్బులిస్తే మందులు, పప్పు ఉప్పు, సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు.. చేతిలోకి డబ్బులు పడలేదు.. ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరుకి వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట!"

"ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో..?" అంటూ రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారు! చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు! "అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా..? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లలో నిలబడడం, ఆ ఫారాలు నింపడం ఏమేరకు సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి!

దానికితోడు కొన్ని బ్యాంకుల్లోని అకౌంట్స్ లో తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే కొంత పెనాల్టీలు విధిస్తాయని చెబుతున్నారు. ఈ పేదల బ్యాంకు ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా..? అనేది సందేహమే! అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం.. వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు తీవ్ర నష్టం అని పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే... ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేకకపోయారని.. సీఎం వైఎస్ జగన్ కి మంచిపేరు రావడాన్ని సహించలేకపోయారని.. ఫలితంగా, ఇలాంటి కుట్రలకు దిగారని.. రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని పలువురు వృద్ధులు ఫైరవుతున్నారని తెలుస్తుంది!