Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేది అపుడే....!?

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మూడు నెలలు ఆగండి అంటున్నారు. ఇంతకీ మూడు నెలలు ఆగితే ఏమి జరుగుతుంది

By:  Tupaki Desk   |   17 Dec 2023 5:45 AM GMT
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేది అపుడే....!?
X

ఏపీలో మరో మూడు నెలలలో కొత్త ప్రభుత్వం వస్తుంది ప్రజలకు తాము ఇచ్చిన హామీలు అన్నీ ఆ వెంటనే నెరవేరుస్తామని టీడీపీ జనసేన ఇటీవల కాలంలో జోరుగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఇక విశాఖ జిల్లాలో యువగళం పాదయాత్రలో అయితే లోకేష్ డేట్ టైం అన్నీ కూడా కలిపి జనాలకు చెప్పేస్తున్నారు. కౌంట్ డౌన్ అంటున్నారు. మరొక్క తొంబై రోజులు ఆగితే ఏపీకి అన్నీ మంచి రోజులే. మన ప్రభుత్వం వస్తుంది ప్రజా ప్రభుత్వం వస్తుంది అని లోకేష్ అంటున్నారు.

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మూడు నెలలు ఆగండి అంటున్నారు. ఇంతకీ మూడు నెలలు ఆగితే ఏమి జరుగుతుంది. అసలు మూడు నెలలకు విపక్షాల భరోసాకు సంబంధం ఏమిటి అన్నది కనుక తీసుకుంటే అది జస్ట్ ఎన్నికల ప్రచారంగానే చూడాలని అంటున్నారు. ఎందుకు అంటే వాస్తవం వేరేగా ఉంటుంది అని అంటున్నారు.

ఏపీలో ఎన్నికలు ఎపుడు అంటే ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్నది అయితే మార్చిలోనే అని అంటున్నారు. గత ఎన్నికల కంటే కూడా ఈసారి ముందే నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అలా కనుక చూస్తే కేవలం ఏపీకి మాత్రమే ఎన్నికలు జరగవు. లోక్ సభకు కూడా కలిపి ఎన్నికలు ఉంటాయి.

మరి దేశవ్యాప్తంగా 547 సీట్లకు ఎన్నికలు అంటే దేశంలోని 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో కోట్లాది మంది ప్రజలకు నిర్వహించడం అంటే కచ్చితంగా ఏడెనిమిది దశలుగానే పోలింగ్ ఉంటుంది. అది ఎపుడూ ఎన్నికలు జరిపే సంప్రదాయమే. ఆ విధంగా చూసుకుంటే ఏపీలో మార్చిలో కానీ ఏప్రిల్ లో కానీ ఎన్నికలు జరిగినా ఫలితాల లెక్కింపు మాత్రం మరో నలభై యాభై రోజుల తరువాతనే అని అంటున్నారు. అన్నీ తెలిసి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది కూడా జనాల తీర్పు బయటకు వచ్చిన తరువాతనే గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది అనవాయితీ.

అలా చూసుకుంటే కనుక ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మే చివరినాటికైనా లేదా జూన్ మొదైటి వారానికైనా సమయం పట్టవచ్చు అని అంటున్నారు. 2019లో జగన్ మే 30న సీఎం గా పదవీ ప్రమాణం చేశారు. ఆ లెక్కన చూసుకుంటే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు జూన్ దాకా సమయం ఉంది.

అంటే ఈ రోజుకు తీసుకుంటే కచ్చితంగా ఆరు నెలలు వ్యవధి ఉంది అన్న మాట. ఒకవేళ ఎన్నికలు తొలి దశలో ఏపీలో పూర్తి అయినా కొత్త ప్రభుత్వం రావాలీ అంటే మరో రెండు నెలలు ఓపిక పట్టాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఏపీకి ఆపద్ధర్మ సీఎం గా వైఎస్ జగన్ ఉంటారు. ఒక వేళ మళ్లీ వైసీపీ గెలిస్తే ఆయనే సీఎం అవుతారు.

అంటే ఏపీలో ఎన్నికలు ముందుగా జరిగినా విపక్షాలు ఆశిస్తున్నట్లుగా మూడు నెలల్లో అయితే ప్రభుత్వం ఏర్పాటు కాదు అనే అంటున్నారు. మరి ఈ ప్రచారం ఎందుకు అంటే ఇదంతా జనాల్లోనూ క్యాడర్ లోనూ జోష్ తెప్పించడానికి అని అంటున్నారు. ఏపీలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది తేలడానికి అయిదారు నెలల వ్యవధి అయితే ఉంది. సో అదన్న మాట విషయం.