కొత్త జిల్లాలు.. పాత కష్టాలు.. మైలేజీ ఉందా.. !
ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల నుంచి ఇటు ప్రభుత్వానికి కానీ.. అటు పార్టీకి కానీ.. ఏమైనా మైలేజీ దక్కుతోందా ? అంటే.. ప్రశ్నగానే మారిందని చెప్పాలి.
By: Garuda Media | 10 Jun 2026 10:00 PM ISTఏ ప్రభుత్వమైనా.. కొత్తగా ఏం చేసినా.. దాని నుంచి మైలేజీకోరుకుంటుంది. ఇక, చంద్రబాబు వంటి వారు ముఖ్యమంత్రిగా ఉంటే.. ఏ పనిచేసినా.. దాని నుంచి మైలేజీ పిండుకునే ప్రయత్నం చేస్తారు. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో చేసింది చెప్పుకొనేందుకు.. ప్రజలనుంచి మైలేజీ సంపాయించుకునేందుకునాయకులు తహతహలాడుతుంటారు. కాబట్టి.. ఏం చేసినా.. దానిలో ప్రజా కోణంతోపాటు.. ఓట్ల కోణం కూడా చూడడం ఏమాత్రం తప్పుకాదు.
ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల నుంచి ఇటు ప్రభుత్వానికి కానీ.. అటు పార్టీకి కానీ.. ఏమైనా మైలేజీ దక్కుతోందా ? అంటే.. ప్రశ్నగానే మారిందని చెప్పాలి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినా.. వాటిలో ఇంకా పాత సమస్యలే.. వెంటాడుతున్నాయి. జిల్లా కేంద్రాలు మారినా.. పాలనా పరమైన ఏర్పాట్లు ముదుకు సాగడం లేదు. అధికారుల కొరత, వనరుల కొరత కూడా కొత్త జిల్లాలను వెంటాడుతూనే ఉంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ వెంటనే ఇంచార్జ్ అధికారులను నియమించింది.
ఇప్పటికీ వారే ఇంచార్జ్‌లుగా కొనసాగుతున్నారు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఉదాహరణకు జిల్లాల పునర్విభజనతో అద్దంకి ప్రకాశం జిల్లా పరిధిలోకి చేరింది. కానీ.. నియోజకవర్గం సమస్యలు, పరిష్కారాలు అన్నీ.. ఇంకా పాత జిల్లాలోనే కొనసాగుతున్నాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్‌ట్రెజరీ కార్యాలయ పర్యవేక్షణ పూర్తిగా బాపట్ల జిల్లా అధికారుల పరిధిలోనే కొనసాగుతోంది. విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్య, వ్యవసాయ శాఖలను రెండు జిల్లాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న జిల్లా సరిహద్దులలో స్వాగత బోర్డులు కూడా బాపట్ల జిల్లాగానే కనిపి స్తున్నాయి. ఈ సమస్య ఇక్కడితో అయిపోలేదు.. పోలవరం జిల్లాలోనూ కనిపిస్తోంది. ఈ విషయాన్ని స్వ యంగా సీఎం చంద్రబాబే చెప్పారు పోలవరం ప్రజల కోసం.. ఇక్కడి ప్రాజెక్టును పరుగులు పెట్టించేందు కు.. జిల్లాను ఇచ్చామన్నారు. కానీ, మౌలిక సదుపాయాల కొరత, జిల్లా కేంద్రంలో అధికారుల కొరత కార ణంగా.. సమస్యలు ఎక్కడివక్కడే అన్నట్టుగా ఉన్నాయి. దీంతో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినా.. ఆశించిన మేరకు ప్రభుత్వానికి మైలేజీ రావడం లేదన్నది వాస్తవం.
