ఏపీలో మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన... ఏ పార్టీకి ఎన్నంటే..?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
By: Tupaki Desk | 28 March 2025 4:57 PM ISTఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ క్రమంలో.. తాజాగా ప్రకటించిన 47 మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవుల్లో 37 పదవులు తెలుగుదేశం, 8 పదవులు జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి.
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల జాబితాను ప్రకటించింది. ఇందులో భాగంగా... 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ లను ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులోనే కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. తొలుత 20 కార్పొరేషన్ ఛైర్మన్ లతో పాటు.. మొత్తం 99 మందితో తొలి జాబితాను విడుదల చేశారు.
అనంతరం నవంబర్ లో రెండో విడత భర్తీ ప్రక్రియ జరగ్గా.. ఆ జాబితాలో 59 మంది పేర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా మూడో విడత జాబితా విడుదలయ్యింది.
బొబ్బిలి - ఎన్. వెంకటనాయుడు
కురుపాం - కే. కళావతి
నర్సీపట్నం - ఆర్. శేషుకుమార్
పలాస - ఎం. శ్రీనివాసరావు
రంపచోడవరం - ఎల్. లక్షణరావు
సాలూరు - ఎం. సూర్యనారాయణ
కొత్తవలస – సీహెచ్. మల్లునాయుడు
విశాఖపట్నం - వై అపర్ణ
పాలకొండ - బీ. సంధ్యారాణి
యలమంచిలి - టీ. లోవకుమారి
దెందులూరు - జీ. రామసీత
ఏలూరు - ఎం. పార్థసారథి
జగ్గంపేట - భరత్ బాబు
మండపేట – సీహెచ్. రామకృష్ణ
తణుకు - కే. శివ
పిఠాపురం - వీ. దేవి
కరప - ఎం. రమేష్
నగరం - పీ. లక్ష్మీ
తాడేపల్లిగూడెం – సీహెచ్. మంగాబాయి
ఉంగుటూరు - కే. జ్యోతి
అద్దంకి - వీ. పద్మావతి
బాపట్ల - కే. శ్రీనివాసరెడ్డి
గుడ్లవల్లేరు - పి. రవికుమార్
మంగళగిరి - జే. కిరణ్ చంద్
నరసరావుపేట - పీ. శ్రీనివాసరావు
పెనమలూరు – ఏడీఆర్ కోటేశ్వరరావు
సత్తెనపల్లి - కే శోభరాణి
గంటసాల - టీ. కనకదుర్గ
మొవ్వ - డి. శివరామయ్య
మార్కాపూర్ - ఎం. వెంకటరెడ్డి
నగరి - డి. రాజమ్మ
కలికిరి - మాలతి
గిద్దలూరు - బీ. బాలయ్య
పీలేరు - పీ. రామమూర్తి
వాల్మీకిపురం - కే. చంద్రమౌలి
సర్వేపల్లి - జి. రామకృష్ణారెడ్డి
ఎస్.ఆర్.పురం - జి. జయంతి
గుంతకల్ - ఎస్. లక్ష్మీదేవి
మడకశిర – బీఎస్. గురుమూర్తి
మైదుకూరు - వెంకట రవీంద్ర
నంద్యాల - జి. హరిబాబు
పాణ్యం - ఏ. గీత
పత్తికొండ - ఎస్. నబీ సాహెబ్
ఎమ్మిగనూరు - కె. మల్లయ్య
ధర్మవరం - జె. నాగరత్నమ్మ
