Begin typing your search above and press return to search.

మేయర్ చైర్మన్ అభ్యర్థుల మీదనే భారం అంతా !

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రత్యక్ష పోరుకు తెర లేపింది తెలుగుదేశం పార్టీ. ఇది నిజంగా మంచి పరిణామమే అని అంటున్నారు.

By:  Satya P   |   21 Aug 2026 3:00 PM IST
మేయర్ చైర్మన్ అభ్యర్థుల మీదనే  భారం అంతా !
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రత్యక్ష పోరుకు తెర లేపింది తెలుగుదేశం పార్టీ. ఇది నిజంగా మంచి పరిణామమే అని అంటున్నారు. ముఖ్యంగా ఈ నిర్ణయం వెనక ప్రజాస్వామ్య స్పూర్తి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజల చేత ప్రజల భాగస్వామ్యంతోనే మేయర్ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఎన్నిక అవుతారు. దాంతో ఎవరు అభ్యర్ధి అన్నది జనాలకు ముందే తెలిసి ఓటు చేస్తారు. ఇక ఆ పదవులకు నెగ్గిన వారికి కూడా ప్రజల విషయంలో డైరెక్ట్ బాధ్యత ఉంటుంది. ప్రజలు కూడా వారిని అడిగి పనిచేయించుకునే విధంగా స్థానికంగా పరిస్థితులు ఉంటాయి. టీడీపీ ఈ విధంగా చ్ చేయడం మంచి పరిణామమే అయినప్పటికీ మేయర్ చైర్మన్ అభ్యర్ధులకు ఎన్నికలు పెను సవాల్ కాబోతున్నాయని అంటున్నారు.

ఆర్థిక భారంతో సహా :

మేయర్ అభ్యర్ధి అయితే ఆయా కార్పోరేషన్ పరిధిలో ఉన్న తన మొత్తం కార్పోరేటర్ అభ్యర్ధులను తానే ఆర్ధికంగా ఇతరత్రా అండదండలు అందించాల్సి ఉంటుంది. ప్రతీ వార్డులో తమ పార్టీ అభ్యర్ధి విజయం సాధించేలా చూసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో రెండవ ఓటు తమకే కచ్చితంగా వేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ఏడు నియోజకవర్గాలలో ఆయన అన్ని విధాలుగా సహకరించి కో ఆర్డినేట్ చేసి ముందుకు నడిపించినట్లుగా ఇపుడు మేయర్లు జిల్లా పరిషత్తు చైర్మన్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం కష్టపడాల్సిందే అని అంటున్నారు.

రంగంలోకి బిగ్ షాట్స్ :

ఇక డైరెక్ట్ ఎన్నికలు మేయర్ అభ్యర్ధులకు భారీ ఖర్చు అని కూడా అంటున్నారు. దాంతో రాజకీయ పార్టీలు బిగ్ షాట్స్ ఏరి కోరి ఎంపిక చేసి పంపాల్సి ఉంటుంది. కేవలం డబ్బు ఉంటే సరిపోదు పలుకుబడి ఉండాలి, మంచి పేరు ఉండాలి, జనంతో మమేకం అయ్యే వారు కావాలి. అన్నింటికీ మించి పార్టీ అభిమానం చూరగొన్న వారు కావాలి. ఇలా చాలా లెక్కలు ఉన్నాయి. ఏపీలో కార్పోరేషన్లు అంటే ఎంతో కీలకం అయినవి. విశాఖ విజయవాడ, తిరుపతి, వంటి కార్పోరేషన్ల మేయర్ పదవులకు ఎంతో ప్రతిష్ట ఉంటుంది. ఇక విశాఖ వంటి చోట్ల అయితే వందకు పైగా డివిజన్లు ఉంటాయి. అతి పెద్ద కార్పోరేషన్. మరి ఇలాంటి చోట అందరికీ కలుపుకుని అన్ని విధాలుగా వారికి దన్నుగా ఉండే వారిని అన్వేషించడం పార్టీలకు ఒక సవాల్ అని అంటున్నారు.

క్రాస్ ఓటింగ్ భయాలు :

తీరా అధినాయకత్వాలు అంగ బలం అర్ధ బలం కలిగిన అభ్యర్ధులను ఎంపిక చేసినా వారు పార్టీ తో కలసి ఉండకపోతే క్రాస్ ఓటింగ్ కూడా జరిగే ప్రమాదం ఉంది. అంటే కార్పోరేటర్ తన వరకూ ఓటేయించుకుని రెండవ ఓటుని వదిలేసే ముప్పు అన్న మాట. అలా ఉండకుండా ఉండాలీ అంటే పార్టీలో చిరకాలంగా పనిచేసిన వారు అందరికీ నచ్చిన వారు అయి ఉండాలి. అలాగే ప్రాంతీయ సామాజిక రాజకీయ సమీకరణలు కూడా సరిపోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అధికారంలో ఉన్న పార్టీలకు కొంత వెసులుబాటు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ఇబ్బంది అని అంటున్నారు. అదే సమయంలో మేయర్ చైర్మన్ అభ్యర్ధులకు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పార్టీలో సహకరిస్తారు. కానీ విపక్షంలో ఉన్న పార్టీకి సర్వం తానే అయి ఉండాలి. మరి ఏపీలో డైరెక్ట్ ఫైట్ అంటే బిగ్ షాట్స్ రంగ ప్రవేశం చేస్తారా చేస్తే ఎవరు వారు అన్నది ఒక చర్చగా ముందుకు వస్తోంది.