పంచాయతీలకు ఎన్నికల్లేవ్..! ఎందుకంటే?
త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు ప్రారంబించింది.
By: Garuda Media | 4 March 2026 5:00 PM ISTత్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు ప్రారంబించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? ఎంతమంది అనర్హు లు ఉన్నారు? అనే వివరాలను సేకరిస్తోంది. ఈ నెల 20 నాటికి ఈ కసరత్తు పూర్తి చేసి.. ఓటర్ల జాబితాల ను కూడా అందించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. దీని ప్రకారం.. ఏప్రిల్ 2వ తేదీతో ముగి యనున్న పంచాయతీల గడువు ప్రకారం.. ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది.
కానీ, సర్కారు ఆలోచన వేరేగా ఉంది. ఏప్రిల్ 2కే గ్రామాల స్తాయిలో పాలనకు గడువు ముగిసిపోయినా.. ఈ ఎన్నికలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నా యని నాయకులు చెబుతున్నారు. 1) బీసీల కు రిజర్వేషన్: ప్రస్తుతం దీనిపై మిశ్రా కమిషన్ అధ్యయ నం ప్రారంభమైంది. ఈ నివేదిక వచ్చాక.. ఎన్నికలకు వెళ్లనున్నారు. అయితే.. ఈ నివేదిక వచ్చేందుకు ఏప్రిల్ 20వ తేదీ వరకు గడువు ఉంది.
ఆ నివేదిక వచ్చిన తర్వాత.. ప్రభుత్వం అధ్యయనం చేసి.. అనంతరం.. ఎన్నికలకు వెళ్లనుంది. ఇది కొంత ఆలస్యం కానుంది. ఇక, ఇదేసమయంలో రిజర్వేషన్లపై ఎలానూ న్యాయపరమైన సమస్యలు వస్తాయి కాబట్టి.. వాటిని కూడా ఎదుర్కొని ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ఈ లోగానే.. జిల్లా పరిషత్ లకు కూడా గడువు తీరుతుంది. అప్పుడు ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో 2వ అంశంగా ముందు పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
ముందుగానే గ్రామీణ స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తే.. గ్రూపు రాజకీయాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి.. పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తే.. అది కూటమి పార్టీలకు మేలు చేస్తుందన్న ఆలోచన ఉంది. దీంతో ముందుగా పరిషత్ ఎన్నికలకు వెళ్లి.. ఇక్కడ భారీ విజయం నమోదు చేసుకోవడం ద్వారా.. ఆ తర్వాతే గ్రామీణ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. సో.. మొత్తంగా గ్రామ ప్రంచాయతీ ఎన్నికలకు కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోందని పార్టీలనాయకులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబుకుపలువురు నాయకులు తమ సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిసింది.
