Begin typing your search above and press return to search.

రోడ్ల రిపేర్ పై బాబు, పవన్ ల ముందుచూపు..హ్యాట్సాఫ్!

వైసీపీ హయాంలో ఏపీలో రోడ్ల దుస్థితి గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Dec 2024 10:52 PM IST
రోడ్ల రిపేర్ పై బాబు, పవన్ ల ముందుచూపు..హ్యాట్సాఫ్!
X

వైసీపీ హయాంలో ఏపీలో రోడ్ల దుస్థితి గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ వచ్చింది. ముందుగా రోడ్ల మరమ్మతులపై ఫోకస్ చేసిన ఈ ఇద్దరు నేతలు...ఆ తర్వాత కొత్త రోడ్లపై కూడా ఫోకస్ పెట్టే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో రోడ్ల మరమ్మతులపై పవన కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రోడ్లు వేశాక వాటర్ పైప్ లైన్ పనుల కోసం రోడ్లను త్రవ్వడం అనేది పెద్ద సమస్యగా మారిందని, దానిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలని కలెక్టర్లకు పవన్ సూచించారు. డ్రైనేజి కాలువలు, వాటర్ పైప్ లైన్ లు వంటివి వేసేటపుడు ముందుగానే డిజైన్ చేసి రోడ్లు తవ్వకుండా చూడాలని సూచించారు. వైసీపీ హయాంలో చాలా చోట్ల ఇలా పైప్ లైన్ల కోసం తవ్విన రోడ్లను పూడ్చలేదని చెప్పారు. ఆల్రెడీ రోడ్లు కట్ చేయకుండానే పనులు చేసేలా డిజైన్ రూపొందించామని, పక్కాగా ఇకపై అమలు చేసేలా చూస్తామని అన్నారు.

రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల ఊసే ఎత్తని జగన్ కు...వేసిన రోడ్లు కట్ చేయకుండా మార్గం చూడాలన్న చంద్రబాబు, పవన్ లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. రోడ్లు కట్ కాకుంటే మరమ్మతులు చేయాల్సిన అవసరమే ఉండదన్న చంద్రబాబు, పవన్ ల ముందుచూపుపై ప్రశంసలు కురుస్తున్నాయి. విజనరీ నేతలకు..విధ్వంసకారి నేతకు ఉన్న తేడా ఇదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.