Begin typing your search above and press return to search.

వైసీపీ బాట‌లో కూటమి.. త‌ప్పు ఎవ‌రిది ..!

వైసీపీ బాటలో కూటమి ప్రభుత్వం పని చేస్తుందా? గతంలో అవలంబించిన విధానాల్ని ఇప్పుడు కూడా అవలంబిస్తున్నారా? వైసిపి హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇంకా మార్పు రాలేదా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

By:  Tupaki Desk   |   16 Jun 2025 3:15 AM
వైసీపీ బాట‌లో కూటమి.. త‌ప్పు ఎవ‌రిది ..!
X

వైసీపీ బాటలో కూటమి ప్రభుత్వం పని చేస్తుందా? గతంలో అవలంబించిన విధానాల్ని ఇప్పుడు కూడా అవలంబిస్తున్నారా? వైసిపి హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇంకా మార్పు రాలేదా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. తల్లికి వందనం కావచ్చు విద్యుత్ శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలు కావచ్చు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావించిన సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం ముఖ్యమైంది. దీన్ని అమలు చేసేందుకు ఏడాది పాటు సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రభుత్వం తాజాగా అమలులో పెట్టింది.

అయితే దీనికి సంబంధించిన విధివిధానాలు, అర్హుల జాబితా నిర్ణయం వంటి విషయాల్లో మాత్రం వైసిపి అనుసరించిన విధివిధానాలను పూర్తిగా అడాప్ట్ చేసుకోవడం విశేషం. దాని ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయటం వంటివి విమర్శలకు తావిచ్చాయి. గతంలో వైసిపి ప్రభుత్వం 300 యూనిట్ల విద్యుత్తు ఉపయోగించిన వారికి అమ్మఒడి పథకాన్ని తీసేసింది. అదేవిధంగా నాలుగు చక్రాలు వాహనాలు ఉన్న వారిని కూడా పక్కకు పెట్టింది. మరీ ముఖ్యంగా పట్టణాల్లో 12,000 గ్రామాల్లో పదివేల రూపాయలు ఆదాయం ఉన్న వారిని కూడా ఈ పథకం నుంచి ఏరేసింది.

దీంతో తమకు ఈ పథకం అందలేదని పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న అప్పటి టిడిపి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నారా లోకేష్ లు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ ఇచ్చేలా చూస్తామని, దీన్ని అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా టాయిలెట్లు పాఠశాల నిర్వహణతో సంబంధం లేకుండా 13 వేల రూపాయలు చొప్పున కాకుండా 15 వేల రూపాయలు చొప్పున అందరికీ అందిస్తామని కూడా పదేపదే హామీలు గుప్పించారు. కానీ పథకం అమలులోకి వచ్చేసరికి మాత్రం పూర్తిగా వైసిపి హాయంలో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా ఈ పథకాన్ని అమలు చేశారు.

తల్లికి వందనం పథకంలో 15 వేల రూపాయలకు బదులుగా 13000 రూపాయలు మాత్రమే తల్లులు ఖాతాల్లో వేశారు. అది కూడా వైసిపి హయాంలో ఎలాంటి నిబంధనలు పెట్టారో అచ్చంగా అవే నిబంధనలతో ఇప్పుడు అమలు చేయటం చర్చ నియాంశంగా మారింది. ఎందుకంటే వైసిపి హయంలో ఎవరైతే లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు కూడా వారికి ఆ సొమ్ములు చేరలేదనేది ప్రభుత్వానికి అందుతున్న నివేదికలను బట్టి తెలుస్తోంది. మరి మార్పు లేని విధంగా ఈ పథకాన్ని కొనసాగించడం అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇక కుటుంబంలో ఎంతమంది ఉన్నా డబ్బులు వేస్తామని చెప్పారు.

కొంతమందికి మాత్రమే వేస్తున్నారు. మరికొందరికి వెయ్యట్లేదు అనే విమర్శలు కూడా ఈ పథకంపై ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక విద్యుత్ బిల్లులు విషయంలో కూడా వైసిపి అనుసరించి విధానాల్ని కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతోంది. అదేమంటే ఆదాని విద్యుత్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయలేమని అందుకే విద్యుత్ భారాలు పెరుగుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

వాస్తవానికి గతంలో చేసుకున్న అనేక నిర్ణయాలను అనేక ఒప్పందాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వీటిలో ప్రధానంగా వలంటీర్లు, సచివాలయాలు అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్టివంటి చట్టాలను కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టింది. అలాంటప్పుడు అదాని విద్యుత్ సంస్థకు చెందిన ఒప్పందాలను ఎందుకు రద్దు చేసుకోకూడదు స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఎందుకు రద్దు చేయకూడదు అనేవి కీలకమైన ప్రశ్నలు. తద్వారా రాష్ట్ర ప్రజలపై భారాలను తగ్గించేందుకు కోటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం చాలా ఉంది.

కానీ అలా చేయకుండా గత ప్రభుత్వం తీసుకున్న‌ నిర్ణయాలను అమలు చేయడం వాటిని రద్దు చేయలేమని చెప్పడం ద్వారా కూటమి ప్రభుత్వంపై ఒకింత వ్యతిరేకత పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైనా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగితే తప్ప కూట‌మి ప్రభుత్వానికి మంచి మార్కులు పడవనేది పరిశీల‌కులు చెబుతున్నటు మాట. మరి ఏం చేస్తారో చూడాలి.