Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో కల్తీ నెయ్యి మీద చర్చ...బాబు పవన్ సహా !

ఏపీ అసెంబ్లీలో కల్తీ నెయ్యి మీద చర్చ జరగనుంది. మంగళవారం ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఈ చర్చ సాగుతుంది అని చెబుతున్నారు.

By:  Satya P   |   24 Feb 2026 1:00 AM IST
అసెంబ్లీలో కల్తీ నెయ్యి మీద చర్చ...బాబు పవన్ సహా !
X

ఏపీ అసెంబ్లీలో కల్తీ నెయ్యి మీద చర్చ జరగనుంది. మంగళవారం ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఈ చర్చ సాగుతుంది అని చెబుతున్నారు. ఇక ఈ చర్చలో కూటమిలోని మూడు పార్టీల నుంచి దాదాపు పది మంది దాకా ఎమ్మెల్యేలు మాట్లాడుతారు అని అంటున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం మాట్లాడుతారు. దాంతో మంగళవారం ఒక హాటెస్ట్ టాపిక్ మీద అసెంబ్లీ వేదికగా సుదీర్ఘం చర్చకు అంతా సిద్ధం అయింది అని భావించాలి.

అనుకున్నా కూడా :

ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతూనే తిరుపతి లడ్డూ కల్తీ మీద చర్చ ఉంటుందని అంతా అనుకున్నారు. ఈసారి జరిగే చర్చలో వైసీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు పాల్గొంటారు అని ప్రచారం సాగింది. అయితే వైసీపీ కేవలం బడ్జెట్ సెషన్ ప్రారంభం సందర్భంగా గవర్నర్ స్పీచ్ కి అటెండ్ అయి ఆ తరువాత బయటకు వెళ్ళిపోయింది. ఇక ఆ మరుసటి రోజు నుంచి అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో అంతా కూటమి ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.

ఉత్కంఠగానే :

ఇదిలా ఉంటే లడ్డూ కల్తీ విషయంలో ప్రభుత్వం ఏమి చెబుతుంది అన్నది ఇక్కడ ఉత్కంఠగా ఉంది. ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి అంతా మాట్లాడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తారు అని అంటున్నారు. సీఎం స్టేట్మెంట్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది అంతా ఆలోచిస్తున్నారు. మరో వైపు చూస్తే శాసనమండలిలో ఇందాపూర్ డైరీ మీద రచ్చ సాగుతోంది. దాని మీద చర్చ కావాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. ఇపుడు శాసనసభలో లడ్డూ కల్తీ గురించి చర్చ జరిగితే మండలిలో కూడా ఇదే అంశం మీద చర్చకు పెడతారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు.

కూటమి పట్టుదలగా :

ఇక చూస్తే కనుక లడ్డూలో కల్తీ జరిగింది అని కూటమి ప్రభుత్వం గతంలో చెప్పింది. ఇపుడు కూడా సిట్ అదే చెప్పింది అని అంటోంది. నెయ్యి లేని విధంగా లడ్డూని తయారు చేశారు అని కూడా ఆరోపిస్తోంది. దాంతో ఈ విషయంతో పాటు అనేక ఇతర విషయాలు ప్రభుత్వానికి తెలిసినవి అన్నీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా కల్తీ లడ్డూ విషయంలో దోషులను వదిలేది లేదని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాంతో ఆ విషయం మీద కూడా సభా వేదికగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేస్తారు అని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకపక్ష కమిషన్ ని నియమించింది. దాని విచారణ తదుపరి కఠిన చర్యలకు కూడా దిగుతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కల్తీ లడ్డూ ఇష్యూ మాత్రం తొలిసారి అసెంబ్లీ వేదికగా అతి పెద్ద చర్చ జరిగేలా ఉంది. మరి ఎటూ అసెంబ్లీకి వెళ్లలేని వైసీపీ దీనిని ఏ విధంగా తమదైన డిబేట్ తో డిఫెన్స్ చేసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.