Begin typing your search above and press return to search.

అన్న క్యాంటీన్ల విషయంలో సంచలన నిర్ణయం

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే.

By:  Satya P   |   28 Nov 2025 11:16 PM IST
అన్న క్యాంటీన్ల విషయంలో సంచలన నిర్ణయం
X

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. పేదల ఆకలిని తీర్చేందుకు అన్న క్యాంటీన్లు అన్న కాన్సెప్ట్ తో వీటిని నిర్వహిస్తున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ఎంతో మంది ప్రతీ రోజూ రెండు పూటలా భోజనం ఉదయం టిఫిన్ చేస్తున్నారు. కేవలం అయిదు రూపాయలకు అన్న క్యాంటీన్ల వద్ద ఆహారం దొరుకుతోంది. ఇది ఏపీలో అతి పెద్ద సంక్షేమంగా కూడా అంతా భావిస్తున్నారు.

రుచిగా శుచిగా :

ఇక అన్న క్యాంటీన్లను మరింత రుచిగా శుచిగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు అయి ఏణ్ణర్ధానికి దగ్గర కావస్తోంది. వీటి మీద ఫిర్యాదులు అయితే పెద్దగా ఎక్కడా రాలేదు, అయితే ప్రభుత్వమే పూనుకుని మరింత గొప్పగా వీటిని నడపాలని చూస్తోంది. దాంతో అన్న క్యాంటీన్లను ఇంకా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్నారు. దాని కోసం ఏకంగా సలహా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సలహా కమిటీలే ఇక మీదట అన్న క్యాంటీన్ల నిర్వహణలో ప్రధాన పాత్ర వహించనుంది.

అంతా బాగున్నాకనే :

అన్న క్యాంటీన్లలో ఆహార పదార్ధాలను ఈ కమిటీ పరిశీలించి ఓకే అన్న తరువాతనే అది ప్రజలకు అందిస్తారు. ఆ విధంగా అన్న క్యాంటీన్లలో మరింత చక్కని ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది ఈ ఏరకు రాష్ట్ర మునిసిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా అన్న క్యాంటీన్ల పనితీరుని ఆహార తీరుని పర్యవేక్షించేందుకు ఏర్పాటు అయ్య సలహా కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారని అంటున్నారు. ఇక ఈ సభ్యుల జాబితాలో ఆయా వార్డుకు చెందిన శానిటేషన్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, అలాగే వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి , స్థానిక ఎన్జీవో ప్రతినిధి, డ్వాక్రా మహిళ, అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్ ఉంటారని చెబుతున్నారు. ఈ కమిటీకి స్థానిక కార్పోరేటర్ లేదా కౌన్సిలర్ నాయకత్వం వహిస్తారు.

నాణ్యత చూడాల్సిందే :

ఉదయం టిఫిన్, రెండు పూటలా భోజనం ఇవన్నీ కూడా కమిటీ తప్పనిసరిగా పర్యవేక్షించాల్సినే అని అంటున్నారు. అలాగే రెండు పూటల భోజనం అంటే రెండు సార్లూ నాణ్యతను దగ్గరుండి చూసిన మీదటనే ఆ పదార్ధాలు క్యాంటీన్ కి వెళ్తాయని చెబుతున్నారు. అంతే కాదు క్యాంటీన్ పరిశుభ్రత ఎలా ఉంది. అక్కడ అమర్చిన టేబుళ్ళ క్లీనింగ్ కానీ వడ్డించే పాత్రలు అలాగే ఆహార పదార్థాలు తీసుకుని వచ్చే పాత్రలు, వాటిని శుభ్రం చేసే తీరుని అన్నీ కూడా కమిటీ పూర్తిగా పరిశీలిస్తుందని ఎక్కడైనా లోపాలు ఉంటే తగిన చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. దాంతో ఇక మీదట మరింత రుచిగా శుచిగా అన్న క్యాంటీన్ ఆహారం అందబోతోంది అన్న మాట.