పొలిటికల్ గేమ్ ...సీమలో జగన్ కి దెబ్బ ఖాయం?
ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అవి ఎంతలా అంటే యాభై దాకా. దాంతో ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోనుంది.
By: Tupaki Desk | 29 Jun 2025 11:00 AM ISTఏపీలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అవి ఎంతలా అంటే యాభై దాకా. దాంతో ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోనుంది. నిజం చెప్పాలంటే ఏపీలో ఇపుడున్న రాజకీయం అసలు కనిపించదు అని అంటున్నారు. ఇక కొత్తగా అసెంబ్లీ సీట్ల పెంపు అన్నది సహజంగా అధికార పార్టీకే లాభంగా ఉంటుంది.
ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. దాంతో తనకు అనుకూలంగా ఈ పునర్ విభజన ప్రక్రియను వాడుకుంటుందని అంటున్నారు. అది ఎలాగంటే 2009లో అప్పటి కాంగ్రెస్ సీఎం ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో కాంగ్రెస్ కి మేలు జరిగేలా చూసుకున్నారు అన్న ప్రచారం జరిగింది.
అంటే టీడీపీకి కంచుకోటలుగా ఉన్న వాటిని విభజనించడం ద్వారా బలాన్ని సగానికి సగం తగ్గించడం అన్న మాట. సరిగ్గా ఇపుడు ఆ పొలిటికల్ గేమ్ ఆడే చాన్స్ టీడీపీకి వచ్చింది అని అంటున్నారు. 2027 మార్చి 1తో జనాభా గణన పూర్తి అవుతుంది. దానితో పాటే సమాంతరంగా కుల గణన కూడా పూర్తి అవుతుంది.
అంటే ఎంత జనాభా ఉంది. ఎన్ని కులాలకు ఎంతెంత బలం ఉంది అన్నది పక్కాగా లెక్క తెలుస్తుంది. దానిని బట్టే ఏపీలో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుంది అని అంటున్నారు. ఇక ఈ ప్రక్రియను ఆసరాగా చేసుకుని వైసీపీ బలాన్ని నిర్వీర్యం చేసేందుకు సహజంగానే టీడీపీ యత్నిస్తుంది అని అంటున్నారు.
రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉంది. దాంతో అక్కడే టీడీపీ ఫోకస్ పెడుతుందని వైసీపీకి దెబ్బ కొడుతుందని అంటున్నారు. వైసీపీకి అక్కడ సామాజిక వర్గాల పరంగా పట్టు ఉంది. ఆయా ప్రాంతాల మీద ఫోకస్ పెట్టడంతో పాటు అక్కడ బలాన్ని బాగా తగ్గించి పక్క నియోజకవర్గానికి బదిలీ చేస్తే కనుక అక్కడా ఇక్కడా రెండిందాలా వైసీపీకి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.
అలాగే తమకు బలం ఉన్న చోట ఆ బలాన్ని మరో చోట కాస్తా వీక్ గా ఉంటే అక్కడికి బదిలీ చేసుకోవడానికి కూడా ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటారు అని అంటున్నారు. ఇక చూస్తే కనుక కొత్తగా యాభై సీట్లు పెరగడం అన్నది కూటమి పార్టీలకు లాభమే అని అంటున్నారు. చాలా మంది ఆశావహులకు అవకాశాలు దక్కుతాయని చెబుతున్నారు.
అదే విధంగా వైసీపీకి కూడా ఇది రాజకీయంగా లాభమే అవుతుందని ఎక్కువ మందికి చాన్స్ ఇవ్వవచ్చు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక పునర్ విభజన ప్రక్రియలో ఎలా ఎక్కడ నుంచి విడదీసి మరెక్కడ కలిపి కొత్త అసెంబ్లీ సీట్లను క్రియేట్ చేసినా ఏపీవ్యాప్తంగా కూటమికి యాంటీ వేవ్ వస్తే ఇవేమీ అసలు పనిచేయవని వైసీపీ నేతలు భావిస్తున్నారు. సో సీట్ల పెంపు తమకే అనుకూలమవుతుందని రెండు వైపులా ధీమా బాగానే కనిపిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
