కూటమి సర్కారుకు 'చాపకింద నీరు'.. అలెర్టు తప్పదు!
ఇప్పుడు ఈవిషయంలో సర్కారు అప్ర మత్తంగా వ్యవహరించకపోతే.. ఇబ్బందులు తప్పవన్నది మేదావులు సైతం చెబుతున్న మాట.
By: Tupaki Desk | 4 Jun 2025 9:48 AM ISTకూటమి సర్కారుకు చాపకింద నీరులా.. వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పుడు ఈవిషయంలో సర్కారు అప్ర మత్తంగా వ్యవహరించకపోతే.. ఇబ్బందులు తప్పవన్నది మేదావులు సైతం చెబుతున్న మాట. ఎందుకం టే.. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల ఏరివేత కార్యక్రమం ఊపందుకుంది. ఏ పించన్లయితే.. సర్కారును ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాయో.. ఇప్పుడు అవే పింఛన్లు వ్యతిరేకతను పెంచుతున్నాయి.
అది ఇది అని కాదు.. అన్ని నియోజకవర్గాల్లోనూ.. ఇదే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా దివ్యాంగుల పింఛ ను ఏరివేతకు సర్కారు నిర్ణయం తీసుకున్న దరిమిలా.. తీవ్రంగా వ్యతిరేకత పెరుగుతున్న సంకేతాలు వస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా దివ్యాంగులు పింఛను తీసుకుంటున్నారు. అయితే.. వీరిలో రెండు కేటగిరీలు ఉన్నాయి. 1) సంపూర్ణ ప్రత్యేక పింఛను. అంటే.. వీరికి రూ.15 వేల చొప్పున అందిస్తారు. ఇక, 2) సాధారణ దివ్యాంగుల పింఛను. ఇది నెలకు రూ.6 వేల చొప్పున ఇస్తారు.
గతంలో ఇవి రూ.10 వేలు, రూ.3000గా ఉన్నాయి. చంద్రబాబు గత ఎన్నికలకు ముందు పెంచుతానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని పెంచారు. అయితే.. ఇప్పుడు వీటిపైనే కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. నిజానికి పింఛను పెంచింది చంద్రబాబు.. కానీ.. ఇప్పుడు అదే భారమైంది. దీంతో వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకునే చర్యలకు దిగారు. ఇది మంచి పరిణామం కాదన్న వాదన వినిపిస్తున్న సమయంలోనే కోతలకు దిగిపోయారు.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛను అందుకుంటున్నవారికి తిరిగి పరీక్షలు చేస్తున్నారు. వీటికి సంబంధించి వారికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దివ్యాంగత్వాన్ని నిరూపించుకోవాలని.. పర్సంటేజీ ప్రకారం.. సర్టిఫికెట్ తీసుకోవాలని.. ప్రభుత్వం షరతు విధించింది. దీనిలో తేడా వస్తే.. పింఛ ను నిలిపివేస్తామని కూడా.. నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ పరిణామం.. సర్కారుపై తీవ్ర వ్యతిరేకతను చాపకింద నీరులా పెంచుతోంది. మరో వైపు.. వృద్ధుల పింఛను విషయంలోనూ.. వారు జీవించి ఉన్నార న్న సర్టిఫికెట్ను(లైఫ్) కోరుతున్నారు.
ఇది కూడా.. ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోంది. పెంచిన పింఛను భారం నుంచి తప్పుకొనేందుకు సర్కారుప్రయత్నిస్తోందని.. అసలు పింఛను పెంచమని ఎవరు కోరారని విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. సో.. ఈ విషయంలో సర్కారు ఆచి తూచి అడుగులు వేయకపోతే.. ఈ వ్యతిరేక పెరిగి పెద్దది కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
