Begin typing your search above and press return to search.

ఇక‌, బాబు దృష్టంతా డెవ‌ల‌ప్‌మెంటే.. నో క్వ‌శ్చ‌న్ ..!

దీనిలో భాగంగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను నిర్ణీత కాలంలో అభివృద్ధి చేయాలన్నది కూటమి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యంగా మారింది.

By:  Tupaki Desk   |   15 Jun 2025 2:30 PM
ఇక‌, బాబు దృష్టంతా డెవ‌ల‌ప్‌మెంటే.. నో క్వ‌శ్చ‌న్ ..!
X

రాష్ట్రంలో ఇక పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టనుందా? అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గడిచిన ఐదు సంవత్సరాల కాలాన్ని పక్కన పెడితే కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో ఏడాది కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఒక పక్కా ప్రణాళికను తయారు చేసుకున్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను నిర్ణీత కాలంలో అభివృద్ధి చేయాలన్నది కూటమి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యంగా మారింది.

దీనిలో పారిశ్రామికంగా రాయలసీమ ప్రాంతాన్ని, ఐటి విద్యలపరంగా విశాఖను, రాజధాని పరంగా అమరావతిని అభివృద్ధి చేయాలనేది కూటమి లక్ష్యం. ఏడాది కాలంలో తొలి ఆరు మాసాలు ఎలా ఉన్నా తర్వాత అరుమాసాలు అనేక సమస్యలు ఎదురయ్యాయి. వరదలు, విపత్తులు సంభవించాయి. దీంతో పాలనలో కొంత గ్యాప్ అయితే వచ్చింది. దీనితోడు ప్రాజెక్టులు ఎక్కడ నిలిచిపోవడం వాటికి సంబంధించిన పనులు తిరిగి ప్రారంభించాల్సి రావడం కూడా సర్కారుకు పెద్ద ఇబ్బందిగానే మారింది. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు విషయంలో గైడ్ బండ కొట్టుకుపోవడం పెను ఇబ్బందిని తీసుకొచ్చింది.

అలాగే అమరావతి రాజధాని పనులకు సంబంధించి అక్కడ భారీ ఎత్తున చెట్లు పేరుకుపోవడం, భవనాలు కూడా నీళ్లలో మునిగిపోవడం వంటివి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఆ సమస్యలన్నీ దాటుకుని అటు కేంద్రంతో మాట్లాడి మరోవైపు ఆర్థిక సంస్థలతో కూడా మాట్లాడి రుణాలు సమీకరించడం తద్వారా పనులను తిరిగి ప్రారంభించడం గడిచిన ఏడాది కాలంలో పట్టాలెక్కాయి. ఇక ఇప్పుడు జరగబోయే కాలంలో పూర్తిగా అభివృద్ధిపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న కూటమి రెండో సంవత్సరం పాలనలో ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలకు సమయాన్ని వెచ్చిస్తుందని అదేవిధంగా పాలన పరంగా కూడా దూకుడు పెంచుతుందని పరిశీలిక‌లు అంచనా వేస్తున్నారు.

అయితే సంక్షేమాన్ని విస్మరించేది లేదని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. సంక్షేమ విషయానికొస్తే ఇప్పటికే కీలకమైనటువంటి రెండు కార్యక్రమాలను అమలు చేశారు ఒకటి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వటం రెండు త‌ల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. తద్వారా దాదాపుగా సంక్షేమాన్ని అమలు చేస్తూనే మరోవైపు ప్రధానంగా అభివృద్ధి ర‌హ‌దారిపై కూటమి ప్రభుత్వం నడవనుందని పరిశీలకులు చెబుతున్నారు.