Begin typing your search above and press return to search.

ఉచిత బస్సు... అచ్చన్న కూడా ప్రకటించేశారు !

ఉచిత బస్సు మహిళలకు అన్నది తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో ఇచ్చిన ఒక అందమైన హామీ.

By:  Tupaki Desk   |   15 May 2025 1:30 PM
ఉచిత బస్సు... అచ్చన్న కూడా ప్రకటించేశారు !
X

ఉచిత బస్సు మహిళలకు అన్నది తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో ఇచ్చిన ఒక అందమైన హామీ. అది కర్ణాటకలో సక్సెస్ అయిన పవర్ ఫుల్ హామీ దాంతో తెలంగాణాలోనూ కాంగ్రెస్ అచ్చెం అలాగే వాడేసింది. అక్కడా సూపర్ సక్సెస్ అయింది. దాంతో ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ మేనిఫేస్టోలో పెట్టింది. అది కాస్తా జనాలకు వీర లెవెల్ లో రీచ్ అయి బంపర్ సక్సెస్ అయింది.

ఇలా హామీ అయితే సక్సెస్ అయింది అమలులో మాత్రం ఒక ఏడాది కాలం లేటు ఉచిత బస్సు అన్నట్లుగా ఏపీలో సీన్ ఉంది. ఉచిత బస్సు కర్ణాటకలో తెలంగాణాలో వెంటనే స్టార్ట్ అయి సూపర్ ఫాస్ట్ గా రోడ్ల మీద పరుగులు తీసింది. అయితే ఏపీలో మాత్రం అది ఇంకా ఔటర్ దగ్గరే ఆగిపోతోంది.

దానికి కారణాలు ఉన్నాయి. కర్ణాటక తెలంగాణాలలో రాష్ట్రమంతటా ఉచిత బస్సు సదుపాయం మహిళలకు కల్పించారు. దాంతో ఖజానాకు తడిసి మోపెడుగా భారం అయింది. ఏపీలో చూస్తే ఈ రెండు రాష్ట్రాలలో అధ్యయనం చేశారు. ఆ మీదట తాపీగా అమలు చేయాలని చూశారు. ఇక రాష్ట్రమంతటా కాదు, జిల్లాలకే అని ఒక షరతు పెట్టినట్లుగా ప్రచారంలో ఉంది.

ఆ జిల్లాలలో కూడా కొత్తగా కొన్ని బస్సులు కొని వాటిలోనే ఉచిత సర్వీస్ అమలు చేయాలని చూస్తున్నారు. దాంతో ఇది చాలా ఆలస్యం అవుతోంది. ఎంత కాదనుకున్నా ఉచిత బస్సు ఏపీలో కూడా వందల కోట్ల రూపాయలలోనే భారం అయ్యేలా ఉంది. దానికి అదనపు బస్సులు అదనపు సిబ్బంది ఉండాలి. అందుకే ఈ పధకం రోడ్డు ఎక్కడానికి చాలా కష్టం అవుతోంది.

ఇక ఉచిత బస్సు పధకం రేపో మాపో అంటూ గత ఏడాదిగా స్టేట్మెంట్ ఇవ్వని కూటమి మంత్రి లేడనే చెప్పాలి. సంబంధిత రవాణా శాఖ మంత్రితో పాటు అంతా వచ్చే నెల నుంచే ఉచిత బస్సు పధకం అమలు అని ప్రకటనలు ఇచ్చుకుంటూ పోయారు. తీరా చూస్తే అవి వర్కౌట్ కాలేదు. దాంతో జనాలలో మొదట్లో ఉన్న ఆసక్తి కస్తా ఆ తర్వాత లేకుండా పోయింది.

ఇక ఉగాది నుంచి ఉచిత బస్సు పధకం అని కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ తరువాత నుంచి ఎవరూ ఆ వైపుగా ఆలోచించడం లేదు. దాదాపుగా ఈ పధకం గురించి మరచిపోతున్న నేపధ్యంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మీడియా ముందుకు వచ్చి ఉచిత బస్సు పధకం మరో రెండు నెలలలో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

దాంతో మరోమారు జనంలో ఇది చర్చకు తావిస్తోంది. రెండు నెలలు అంటే జూలై నుంచి అని భావించాలి. మరి అప్పటికైనా ఈ పధకం అమలు అవుతుందా అంటే ఏమో అన్న మాటే ఉంది. ఎందుకు అంటే ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలలో కొన్ని జూన్ నుంచి అమలు చేయడానికి కూటమి సర్కార్ చూస్తోంది. అవి కనుక అమలు అయితే ఖజానా మీద తడిసి మోపెడు భారం అవుతుంది.

దానికి తోడు ఉచిత బస్సు కూడా వస్తే ఇంకా భారం పెరిగిపోతుంది. ఏ పధకం అయినా ఆరభించడంలో ఆలస్యమైనా ఎవరైనా భరిస్తారు కానీ అదే పధకం మధ్యలో ఆపితే రివర్స్ లో కొడుతుంది. అందుకే అన్నీ ఆలోచించుకుని కాస్తా లేట్ అయినా అమలు చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ఆలోచన అని అంటున్నారు. మరి అచ్చెన్న చెప్పినట్లుగా ఉచిత బస్సు రయ్ మని జూలైలో దూసుకుని వస్తే సూపర్ హిట్టే. కాకపోయినా ఏమీ కాదు. ఎందుకంటే ఈ తరహా ప్రకటనలు జనాలు ఇప్పటికే చాలా విన్నారు. అయితే ఎపుడో ఒకపుడు ఉచిత బస్సు రోడ్ల మీదకు రావడం అయితే ఖాయం అంటున్నారు. అది ఎపుడూ అంటే బహుశా ఎవరికీ తెలియదేమో.