Begin typing your search above and press return to search.

‘మోడీ మిస్సైల్, అమరావతి అన్ స్టాపబుల్’... లోకేష్ స్పీచ్ వైరల్!

ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేశారు.

By:  Tupaki Desk   |   2 May 2025 11:18 AM
‘మోడీ మిస్సైల్, అమరావతి అన్ స్టాపబుల్’... లోకేష్  స్పీచ్ వైరల్!
X

ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేశారు. తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన.. అమరావతి 2.0 మహోజ్వల ఘట్టం వేదికపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... అమరావతి పునఃనిర్మాణ సభా వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్న అనంతరం మంత్రులు ప్రసంగించారు. ఇందులో భాగంగా... ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రజల్లో మరింత మనోధైర్యం నింపే మాటలు మాట్లాడారు. మోడీని భారత్ మిస్సైల్ అని అభివర్ణించారు.

అమరావాతి పునఃనిర్మాణ సభలో "అమరావతి నమో నమః" అని రెండు సార్లు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్... తొలుత పహల్గాం దాడి గురించి ప్రస్థావించారు. ఈ సందర్భంగా... నమో కోట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మ తిరగడం ఖాయమని.. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరని అన్నారు.

ఇదే సమయంలో... ఒక్క పాకిస్థాన్ కాదు, 100 పాకిస్థాన్ లు వచ్చినా భారత్ ను ఏమీ చేయలేరని చెప్పిన మంత్రి నారా లోకేష్... భారత్ వద్ద మోడీ అనే మిసైల్ ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలకు సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారు మ్రోగిపోయింది. లోకేష్ స్పీచ్ కు కు అభినందనలు వినిపించాయి!

అనంతరం... ఆంధ్రప్రదేశ్ అంటే మోడీకి ప్రత్యేక అభిమానం అని చెప్పిన లోకేష్.. ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చేబుతూ ఆయన మద్దతు ఇస్తున్నారని అన్నారు. 2014లో మనల్ని మెడపట్టి గెంటేశారని.. రాజధాని లేకుండానే విడిపోయామని.. అయితే, చంద్రబాబు ఆత్మస్తైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారని.. క్లిష్ట పరిస్థితులు చంద్రబాబుకు కొత్త కాదని అన్నారు.

అయితే... చంద్రబాబుపై కోపంతో కొంతమంది రాజధానిని పక్కన పెట్టారని.. అయితే, అమరావతికి ఆంధ్రా ప్రజలంతా అండగా నిలబడ్డారని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని నిర్భందాలు ప్రయోగించినా అమరావతి రైతులు తగ్గేదే లే అన్నారని.. ఎన్ని దొంగ కేసులు పెట్టినా, మరెన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాలు మాత్రం ఆపలేదని తెలిపారు.

ఈ విధంగా పట్టుదల చూపించిన రాజధాని రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పిన లోకేష్... ఆపేదానికి, పీకేదానికి అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న మొక్క కాదు.. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాధాని.. అమరావతి అన్ స్టాపబుల్ అని లోకేష్ ముగించారు. దీంతో... లోకేష్ స్పీచ్ వేరే లెవెల్ అనే కామెంట్లు చేస్తున్నారు తమ్ముళ్లు!