ఎయిరిండియా బిజినెస్ క్లాస్ లో గుజరాత్ మాజీ సీఎం... మృతిపై నిర్ధారణ!
అవును... గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతిచెందారనే విషయం తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 12 Jun 2025 6:52 PM IST242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారనే విషయం కలకలం రేపగా.. తాజాగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది!
అవును... గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతిచెందారనే విషయం తెరపైకి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ప్రయాణికుల జాబితాలో 12వ ప్రయాణికుడిగా విజయ్ రామ్నిక్ లాల్ రూపానీ ఉన్నారు. అతనిపై బిజినెస్ క్లాస్ కేటగిరి కింద టిక్కెట్ బుక్ చేయబడింది!
ఈ సమయంలో విజయ్ రూపానీ రాజ్ కోట్ నివాసం వెలువపల కనిపిస్తున్న దృశ్యాలు తీవ్ర ఉద్వేగభరిత వాతావరణాన్ని చూపిస్తున్నాయి! ఆయన నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, చుట్టుపక్కల వారు ఆందోళన చెందుతూ చేరుకుంటున్నారు. కన్నీళ్లతో ఆయన ఇంటివద్ద ప్రజలు గుమిగూడటం ప్రారంభించారు.. వారి ముఖాల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తుంది!
లండన్ లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణించడానికి టిక్కెట్ బుక్ చేసుకున్నారని తెలుస్తోంది. కాగా... బీజేపీకి చెందిన విజయ్ రామ్నిక్ రూపానీ 2016 నుంచి 2021 వరకూ రెండు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా.. చిన్న కుమారుడు పూజిత్ ఓ ప్రమాదంలో మృతి చెందారు.
