Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా సర్వం ఎడ్జ్.. మోడీ ఎంట్రీతో ఈ సంస్థ బ్యాక్ గ్రౌండ్ పై ఆరా

నిజానికి ఈ సంస్థ ఏమిటి? ఎంత పెట్టుబడి పెట్టారు? దీనిలో వాటా దారులు ఎంతమంది ఉన్నారు? వారెంత పెట్టుబడులు పెట్టారు? లాంటి ఎన్నో ఆసక్తికర అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

By:  Garuda Media   |   18 Feb 2026 10:44 AM IST
హాట్ టాపిక్ గా సర్వం ఎడ్జ్.. మోడీ ఎంట్రీతో ఈ సంస్థ బ్యాక్ గ్రౌండ్ పై ఆరా
X

దేశ రాజధాని ఢిల్లీలో ‘‘ఏఐ ఇంపాక్ట్ ఎక్స్ పో 2026’’ జరుగుతున్నది తెలిసిందే. ఈ సమిట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఈ సదస్సు సందర్భంగా బెంగళూరుకు చెందిన ‘సర్వం ఏఐ’ సంస్థ తమ ఏఐ కళ్లజోడు (సర్వం ఎడ్జ్)ను మార్కెట్లోకి తీసుకురానుంది. తాజాగా ఆ సంస్థకు చెందిన కళ్లద్దాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధరించటంతో అందరి చూపు ఈ సంస్థ మీదా.. దాని ఉత్పత్తి మీదా పడింది. దీంతో ఈ సంస్థ యజమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజానికి ఈ సంస్థ ఏమిటి? ఎంత పెట్టుబడి పెట్టారు? దీనిలో వాటా దారులు ఎంతమంది ఉన్నారు? వారెంత పెట్టుబడులు పెట్టారు? లాంటి ఎన్నో ఆసక్తికర అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

ఏఐ సాంకేతికతతో వీరు తయారు చేసిన గ్లాసెస్ గురించి వీరు ఒక వీడియోను షేర్ చేశారు. అందులో తమ ఉత్పత్తి అయిన సర్వంకేజ్ గురించి వివరాలు వెల్లడించారు. దాని పనితీరుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత .. ఈ కళ్లాద్దాల మీద మరింత క్రేజ్ పరిగింది. ముందుగా ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని వివరాలు.. వీరు రూపొందించిన ఈ ఏఐ కళ్లద్దాల గురించిన వివరాల్లోకి వెళితే.. 2023లో బెంగళూరు కేంద్రంగా వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ తో పాటు మరికొందరు కలిసి ఈ ‘సర్వం ఏఐ’ సంస్థను స్థాపించారు. వీరు తయారు చేసిన గ్లాసెస్ (కళ్లద్దాలు)కు ‘సర్వం కేజ్’ పేరు పెట్టారు. ప్రధాని మోడీ వీటిని ధరించిన తర్వాత వీటి మీద సామాన్యుల్లోనూ ఆసక్తి మొదలైంది.

సర్వం కేజ్ కళ్లద్దాలను మేడిన్ ఇండియాగా పేర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా మేడిన్ ఇండియా ఉత్పత్తిగా చెప్పొచ్చు. దీంతో ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తగా ఈ స్మార్ట్ గ్లాసెస్ కు ఆసక్తి పెరుగుతోంది. ఈ మధ్యనే మెటా రేబాన్ మెటా పేరుతో గ్లాసెస్ విడుదల చేసింది. గత ఏడాదిలోనే ఈ సంస్థ 70 లక్షల కళ్లద్దాలను అమ్మకాలు జరిపింది. సర్వం ఎడ్జ్ విషయానికి వస్తే.. ఇప్పటికే సర్వం అక్షర్, సర్వం స్టూడియో లాంటివి ఏర్పాటు చేసి తమ ఉత్పత్తి సాఫీగా సాగేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక.. ఈ సంస్థ పెట్టుబడులు.. వ్యాపార టర్నోవర్ లెక్కలు.. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టినోళ్ల బ్యాక్ గ్రౌండ్ చూస్తే పలు విషయాలు ఇట్టే అర్థమవుతాయి. ఈ సంస్థ ఇప్పటివరకు రూ.450 కోట్ల పెట్టుబడిని సేకరించింది. ఈ సంస్థలో లైట్ స్పీడ్ వెంచర్పార్టనర్స్, పీక్ XV పార్టనర్స్, ఖోస్లా వెంచర్స్ లాంటి సంస్థలు ఇందులో పెట్టుబడి పెట్టాయి. ఇక్కడే ఖోస్లా వెంచర్స్గ గురించి చెప్పాలి. ఓపెన్ ఏఐలో పెట్టుబడిన వ్యక్తిని ఇంత సులువుగా ఈ సంస్థలో పెట్టుబడి ఎందుకు పెడతారు? అన్న సందేహం కలుగుతుంది. దీనికి తగ్గట్లే ఆన్సర్ సిద్దంగా ఉంది. సంస్థ విజన్ తో పాటు.. దాని ఉత్పత్తుల్ని చూస్తే ఈ సంస్థ ఏ తీరులో ఉందన్న విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా సుమారు రూ.99 కోట్ల సబ్సిడీ ఇవ్వటం గమనార్హం.

గత ఏడాది మార్చి 31 నాటికి ఈ సంస్థ ఆదాయం రూ.28-30 కోట్లు. ఈ సంస్థ ఎక్కువగా పరిశోధన.. డెవలప్ మెంట్ మీద పోకస్ పెడుతోంది. 2026 ఫిబ్రవరి లెక్కల ప్రకారం ఈ సంస్థలో దాదాపు 290 మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా ఇంజనీర్లు.. ఏఐ పరిశోధకులే ఉండటం గమనార్హం. ఈ సంస్థ ఈ మధ్యనే తమిళనాడు ప్రభుత్వంతో కలిసి ‘సావరిన్ ఏఐ పార్క్’ ఏర్పాటు చేసే దిశగా డీల్ కుదర్చారు.

ఈ విషయాన్ని పక్కన పెట్టి.. దీన్ని ఎలా వినియోగించాలన్న అంశంలోకి వెళితే.. ఈ స్మార్ట్ గ్లాసెస్ కేవలం కళ్ళజోడులా మాత్రమే కాకుండా, ముఖంపై ఉండే ఒక చిన్న కంప్యూటర్‌లా పనిచేస్తాయి. ఇందులో అమర్చిన కెమెరాలు, మైక్రోఫోన్ల ద్వారా కళ్లజోడును ధరించిన వారు చూసే అంశాలను ఇది అర్థం చేసుకుంటుంది. అదేసమయంలో ఏదైనా సమాచారాన్ని అడిగితే ఇట్టే చెప్పేస్తుంది. వాయిస్ కమాండ్ ద్వారా ఏం అడిగినా.. స్పందిస్తుంది. మీరో న్యూస్ పేపర్ చదువుతున్నారు. అది ఇంగ్లిషులో ఉంది. దాన్ని తెలుగులో అనువాదం చేసి చెప్పమంటే ఇట్టే చేసేస్తుంది. తెలుగుతో సహా పది కంటే ఎక్కువ భారతీయ భాషల్లో సమాచారాన్ని ఇవ్వగలదు. ఈ గ్లాసెస్ సర్వం ఎడ్జ్ మోడల్‌పై పని చేస్తాయి. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి ఇంటర్నెట్ లేదంటే వేరే సర్వర్ అవసరం లేదు, నేరుగా డివైజ్‌లోనే జరుగుతుంది. దీని ధర ఇంకా నిర్ణయించలేదు. ఈ ఏడాది మేలో దీన్ని మార్కెట్ లోకి విడుదల చేస్తారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటివరకు చేతిలో ఉన్న మొబైల్ రాజ్యం ఏలితే.. రానున్న రోజుల్లో ఈ ఏఐ కళ్లజోడుకు ప్రజలు ఇట్టే కనెక్టు అవుతారని చెప్పక తప్పదు.