Begin typing your search above and press return to search.

మూడో తరగతి నుంచే ఏఐ బోధన.. ప్రభుత్వ నిర్ణయంపై అంతా షాక్..

ప్రపంచం ఇప్పుడు ‘ఏఐ విప్లవం’తో ఉంది. చాట్‌జీపీటీ, జెమినీ, మిడ్‌జర్నీ, కోపైలట్‌, గ్రోక్‌ ఏఐ వంటి సాధనాలు కేవలం ఐటీ రంగానికే కాకుండా, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల దాకా ప్రవేశించాయి.

By:  Tupaki Desk   |   13 Oct 2025 8:30 PM IST
మూడో తరగతి నుంచే ఏఐ బోధన.. ప్రభుత్వ నిర్ణయంపై అంతా షాక్..
X

మనం ఇప్పుడు అభ్యసించే విద్యా విధానం ‘మెకాలే’ విద్యా విధానం. ఇది అందరికీ తెలిసిందే. భారతదేశం ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచింది. భారత్ అంటే అర్థం చాలా గొప్పగా ఉంటుంది. ‘భా’ అంటే ప్రకాశం.. ‘రత్ లేదా రత’ అంటే నిమగ్నం అయినది అని.. ‘భారత్ అంటే జ్ఞానంను అనుసంరించేది.. లేదా జ్ఞానాన్ని పంచేది’ అని అర్థం. మొఘల్ దండయాత్రలకు ముందు ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన దేశం భారత్. నలంద, తక్షశిలా వంటి వాటితో ప్రపంచం యావత్తు జ్ఞానంతో వెలిగిపోయేది.

ఆ తర్వాత బ్రిటీష్ వారు వచ్చి వీరు ఇంత తెలివిగా ఉంటే ప్రపంచాన్ని ఏలుతారని గ్రహించి మన సంస్కృతిని ఆగం చేసే ప్రయత్నం చేశారు. 200 సంవత్సరాలు పాలించినా.. మన సంస్కృతని ఏమీ చేయలేకపోవడంతో దాన్ని మొత్తం నాశనం చేసేందుకు ‘మెకాలే’ తన విద్యా విధానంను ప్రవేశ పెట్టాడు. మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న అబుల్ కలాం.. హిందూ సంస్కృతిని ఇష్టపడని కమ్యూనిస్టులు పాఠ్యపుస్తకాలు తయారు చేసి దోచుకునేందుకు వచ్చిన మొఘలులను హీరోలుగా చూపించి.. దేశాన్ని కాపాడిన హిందూ రాజులు, చక్రవర్తులను విలన్లుగా చూపించారు.

2014 నుంచి విద్యా వ్యవస్థలో కొంచెం కొంచెం మార్పులు రావడం మొదలైంది. నిజమైన రాజులు, చక్రవర్తుల కథలను నేటి యువత చదువుకుంటోంది. భారతదేశ విద్యా చరిత్రలో ఒక కొత్త యుగం ప్రారంభమవబోతోంది. 2026-27 విద్యా సంవత్సరంలోనే మూడో తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence – AI) పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావించడం ఒక సాహసోపేత నిర్ణయం. ఇది కేవలం ఒక విద్యా సంస్కరణ కాదు.. 21వ శతాబ్దపు డిజిటల్‌ భవిష్యత్తుకు పునాది. ఇది జాతీయ విద్యా విధానం (NEP–2020)లో పేర్కొన్నట్లుగా, విద్యను “తరగతి గోడలకతీతంగా” మార్చే దిశలో ఒక సాంకేతిక మైలురాయి.

భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం..

ప్రపంచం ఇప్పుడు ‘ఏఐ విప్లవం’తో ఉంది. చాట్‌జీపీటీ, జెమినీ, మిడ్‌జర్నీ, కోపైలట్‌, గ్రోక్‌ ఏఐ వంటి సాధనాలు కేవలం ఐటీ రంగానికే కాకుండా, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల దాకా ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే విద్యార్థుల్లో డిజిటల్‌ అక్షరాస్యత పెంపొందించడం అత్యవసరం. భారత విద్యాశాఖ ప్రణాళిక ప్రకారం.. దేశ వ్యాప్తంగా కోటి మందికి పైగా ఉపాధ్యాయులకు ఏఐ బోధనలో శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, సృజనాత్మక దృక్పథం వంటి నైపుణ్యాలను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా మారబోతున్నాయో మనకు తెలుసు. ఏఐ తెలుసుకున్న విద్యార్థి కేవలం ‘సాంకేతిక వినియోగదారు’ కాదు, భవిష్యత్తు సృష్టికర్త అయ్యే అవకాశం ఉంది.

గ్రామీణ విద్యార్థులకు సవాలు

అయితే ఈ మార్పు అమల్లో అతిపెద్ద అడ్డంకి పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్‌ అంతరం (Digital Divide). పట్టణాల్లో స్మార్ట్ క్లాస్‌ రూములు, హై స్పీడ్ ఇంటర్నెట్ సులభంగా అందుతుంది. కానీ గ్రామీణ పాఠశాలల్లో ఇంకా విద్యుత్‌ సరఫరా అంతరాయం, కనెక్టివిటీ కొరత, పరికరాల లేమి సాధారణమే. అయితే, ప్రభుత్వం ‘ఏఐ బోధన’ను ప్రవేశపెట్టడమే కాకుండా, డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణంపై సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతీ మండల కేంద్రంలో ‘కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్స్’ లేదా ‘డిజిటల్ ల్యాబ్స్’ ఏర్పాటు చేసి, పాఠశాల సమయం తర్వాత కూడా విద్యార్థులు కంప్యూటర్‌, టాబ్లెట్‌, ఇంటర్నెట్‌ వనరులు వినియోగించుకునేలా చేయాలి. అదే సమయంలో.. పాఠ్యాంశాలు స్థానిక భాషల్లో అందుబాటులో ఉండాలి. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ వంటి భాషల్లో ఏఐ పాఠ్యాంశాలు ఉంటేనే విద్యా సమానత్వం సాధ్యమవుతుంది.

భారత విద్యా సంస్కరణలు ఇప్పటివరకు పుస్తకాల ఆధారంగా నడిచాయి; ఇకపై అవి ‘ఆలోచనల ఆధారంగా’ నడవబోతున్నాయి.

మూడో తరగతి విద్యార్థి ఒక చిన్న ఏఐ మోడల్‌ను రూపొందించే రోజుకు మనం ఎంతో దూరంలో లేము. అదే రోజు భారత విద్యా వ్యవస్థ ‘తరగతి గోడల నుంచి క్లౌడ్ వరకు’ ప్రయాణం పూర్తి చేసిన రోజు అవుతుంది. మూడో తరగతి నుంచే ఏఐ పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడం భారత విద్యా వ్యవస్థకు విప్లవాత్మక మార్పు. సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉంచి, సమాన అవకాశాలతో పిల్లలను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయగలిగితే ఇది కేవలం విద్యా నిర్ణయం కాదు, దేశ భవిష్యత్తు కోసం పెట్టుబడి అవుతుంది.