’ఏఐ’ రాస్తున్న కోడింగ్ విధి రాత మైక్రోసాఫ్ట్ లో 30 శాతం.. మెటాలో మొత్తం
మా సాఫ్ట్ వేర్ కోడ్ తయారీలో గూగుల్ కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్-ఏఐ)పైనే ఎక్కవగా ఆధారపడుతోంది.
By: Tupaki Desk | 1 May 2025 3:30 PMమా సాఫ్ట్ వేర్ కోడ్ తయారీలో గూగుల్ కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్-ఏఐ)పైనే ఎక్కవగా ఆధారపడుతోంది. అలా జనరేట్ చేసిన కోడ్ ను ఇంజినీర్లు సమీక్షిస్తున్నా.. ఏఐ వినియోగం మాత్రం పెరిగింది.
-గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
మా కంపెనీకి సంబంధించి 30 శాతం కోడింగ్ ను కృత్రిమ మేధతోనే రాస్తున్నాం. నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్‌పై ఆధారపడడం పెరుగుతోంది. ఇది ఇంకా అధికమవుతుంది
- ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల
మరో 18 నెలల్లో మా కంపెనీకి చెందిన కోడింగ్ కృత్రిమ మేధనే చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఓ బృందంలో సభ్యుడిగా మారింది. త్వరలోనే టాప్ కోడర్ల కంటే ఏఐ మెరుగ్గా పనిచేస్తుంది
-మెటా సీఈవో మార్క్ జుకెర్ బర్గ్
ఇవీ.. మూడు దిగ్గజ టెక్ కంపెనీల అధినేతల వ్యాఖ్యలు. ఏఐ.. ఏఐ.. ఏఐ.. ఇదొక ప్రభంజనం ఇప్పుడు. దీని సాయంతో కోడింగ్ ప్రక్రియ ఫాస్ట్ అవుతుంది.. సమయం ఆదా అవుతుంది.. అన్నిటికి మంచి ఆవిష్కరణల విషయంలో వేగం పెరుగుతుంది. అందుకే దిగ్గజ టెక్ కంపెనీలు ఏఐ మాట పలవరిస్తున్నాయి. ముందుముందు అంతా ఏఐనే అనే చర్చ నడుస్తోంది.
తాజాగా జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. ఏడాదిన్నరలో తమ కంపెనీకి చెందిన కోడింగ్ కృత్రిమ మేధనే చేస్తుందని తెలిపారు. ఏఐ.. టీమ్ మెంబర్ అయిపోయిందని.. భవిష్యత్ లో టాప్ కోడర్ల కంటే మెరుగ్గా పనిచేస్తుందని కూడా జోస్యం చెప్పారు. టార్గెట్ ను ఇస్తే.. ఏఐ ఆ పనిని సమర్థంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. బగ్ లను కనుగొంటూ, అధిక-నాణ్యమైన కోడ్‌ను సొంతంగా రాస్తుందని వివరించారు. తమ లామా ప్రాజెక్ట్ లో చాలావరకు కోడింగ్ ను ఏఐనే పూర్తిచేస్తుందని జుకర్ బర్గ్ చెప్పడం గమనార్హం.
నాణ్యత కోసం ఏఐ బేస్డ్ టూల్స్ పై ఆధారపడటం పెరుగుతోందని సత్యనాదెళ్ల చెప్పడం.. గూగుల్ సాఫ్ట్ వేర్ కోడ్ తయారీకి ఏఐనే నమ్ముతోందని సుందర్ పిచాయ్ వెల్లడించడం.. త్వరలో మరిన్ని ఏఐ మోడళ్లను అందుబాటులోకి తేనున్నట్లు జుకర్‌బర్గ్ పేర్కొనడం..
టెక్ ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) రాస్తున్న ’కొత్త కోడింగ్’ అని చెప్పొచ్చు.