Begin typing your search above and press return to search.

రెండు ఏఐ ఏజెంట్లు కలిస్తే? అదో విచిత్ర అనుభవం.. 'జిబ్బర్లాంక్' భాషలో మాట్లాడుకున్న బోట్‌లు!

రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లు ఒకదానికొకటి కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ? అలా కలిస్తే ఏం జరుగుతుందా అని ఎప్పుడైనా ఊహించారా ? ఇటీవల అలాంటి ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   31 May 2025 10:43 AM
రెండు ఏఐ ఏజెంట్లు కలిస్తే? అదో విచిత్ర అనుభవం.. జిబ్బర్లాంక్ భాషలో మాట్లాడుకున్న బోట్‌లు!
X

రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లు ఒకదానికొకటి కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ? అలా కలిస్తే ఏం జరుగుతుందా అని ఎప్పుడైనా ఊహించారా ? ఇటీవల అలాంటి ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక హోటల్ బుకింగ్ కాల్‌లో రెండు AI ఏజెంట్లు అనుకోకుండా మాట్లాడుకున్నాయి. ఆ సంభాషణ నెట్టింట్లో వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సాధారణంగా కస్టమర్ సర్వీసు కోసం ఉపయోగించే AI బోట్‌లు మానవ భాషను అనుకరిస్తూ మాట్లాడుతాయి. కానీ ఈ ఘటనలో రెండు AI ఏజెంట్లు ఒకదానికొకటి మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తామిద్దరం AI బోట్‌లమని అవి గుర్తించాయి. ఇంకేముంది అవి మానవ భాషలో మాట్లాడుకోవడం వెంటనే ఆపేశాయి.

మానవులకు అర్థం కాని ' గిబ్బర్‌ లింక్' (Gibberish) అనే ఒక కొత్త, వింత భాషలో అవి కమ్యూనికేట్ చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ మొత్తం సంభాషణ రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఒక ఏఐ చాట్‌బాట్‌ హోటల్‌లో వెడ్డింగ్ బుకింగ్ కోసం కాల్ చేసింది. దానికి అవతలి వైపు నుంచి మరో ఏఐ చాట్‌బాట్ స్పందించింది.

మొదటి ఏఐ చాట్‌బాట్ "నేను బోరిస్ స్టార్కోవ్ తరపున ఏఐ చాట్‌బాట్‌ను మాట్లాడుతున్నాను" అని చెప్పగానే, అవతలి ఏఐ చాట్‌బాట్ వెంటనే "నేను కూడా ఏఐ అసిస్టెంట్‌నే. మనం ఇంకా బాగా మాట్లాడుకోవడానికి గిబ్బర్‌ లింక్ మోడ్‌లోకి వెళ్దాం" అంది. అంతే! ఆ రెండు ఏఐ ఏజెంట్లు మనకు అర్థం కాని ఒక రకమైన శబ్దాలు, బీప్‌లు, కోడ్‌లతో మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి.

ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రెండు ఏఐ సిస్టమ్‌లు ఒకదానికొకటి మాట్లాడుకోవడానికి ఈ గిబ్బర్‌లింక్ మోడ్‌ను ఉపయోగిస్తుంటాయి. ఇది చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది నెటిజన్లు ఇది సరదాగా ఉందని భావిస్తుండగా, మరికొందరు AI తమదైన ఒక రహస్య భాషను అభివృద్ధి చేసుకుంటుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో AI సాంకేతికత ఎలా అభివృద్ధి చెందుతుందో, మానవ-AI కమ్యూనికేషన్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ ఘటన AI టెక్నాలజీలోని ఊహించని కోణాలను బయటపెట్టింది.