Begin typing your search above and press return to search.

వెల్ డన్ ఆనం సార్... శివాజీని వాయిస్తున్న నెటిజన్లు!

ఇదే సమయంలో... ఏపీలో అధికార టీడీపీకి బాధ్యత మరింత పెరిగిందని అంటున్నారు. పలువురు టీడీపీ సీనియర్లు దీనితో ఏకీభవిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 12:10 PM GMT
వెల్ డన్ ఆనం సార్... శివాజీని వాయిస్తున్న నెటిజన్లు!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ & కో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో ఏపీకి మరింత మంచి రోజులు వచ్చయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో... ఏపీలో అధికార టీడీపీకి బాధ్యత మరింత పెరిగిందని అంటున్నారు. పలువురు టీడీపీ సీనియర్లు దీనితో ఏకీభవిస్తున్నారు.

మరోపక్క ఏపీలో ప్రజలు వన్ సైడ్ మేన్డేట్ ఇచ్చారంటూ విపరీతమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని టీడీపీపై పెట్టుకున్నారనే విషయం మరిచిపోయి.. రోత రాజకీయాలకు తెరలేపుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... శివాజీని ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... సినీనటుడు శివాజీకి టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి చిరకలు వేశారు. టీడీపీ ఘన విజయం అనంతరం... మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నట్లుగా వార్నింగులూ గట్రా ఇస్తున్న శివాజీకి ఆనం స్మూత్ వార్నింగ్ ఇచ్చారు.

వివరాళ్లోకి వెళ్తే... టీడీపీ ఘన విజయం సాధించడంతో మీడియాలో హల్ చల్ చేస్తున్నారు శివాజీ. ఈ క్రమంలో తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. వెంకటేశ్వర స్వామి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక స్వామి కళకళ్లాడుతూ ఉన్నారన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

"స్వామిని చూస్తే కళకళ్లాడుతున్నారు. అంతకముందు చూస్తే కాస్త తేడాగా ఉండేవారు. ఏపీలో అమరావతి, పోలవరం స్వామి లక్ష్యాలు. కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బాగుటుంది. ఇందులో ఏం అనుమానం లేదు. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా కర్మ వదిలిపెట్టలేదు. ఈ రోజు మిమ్మల్ని తిడుతున్నారు, కొడుతున్నారు. స్వామిదగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష" అని శివాజీ వ్యాఖ్యానించారు.

ఈ సమయంలో కొండపై శివాజీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి.. "పాలిటిక్స్ వద్దు సర్.. ఎన్నిసార్లు చెప్పాలి మీకు" అని క్యాప్షన్ పెట్టారు. ఈ రియాక్షన్ పై నెటిజన్లు ఆనంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మరోపక్క శివాజీపైనా విరుచుకుపడుతున్నారు.

ఇందులో భాగంగా... తిరుమల కొండపై రాజకీయం వద్దు అని చెప్పి.. అక్కడ అనవసరపు మాటలు మాట్లాడిన వ్యక్తి మీ పార్టీకి సపోర్ట్ చేసేవారని తెల్లిసి కూడా ఖండించారు.. వెల్ డన్ సర్ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ ఐదేళ్లు ప్రెస్ ని కొండపైని అనుమతించొద్దని, ఈ విషయంలో బోర్డు & ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఉండాలని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదే సమయంలో... స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు మనసులో స్వామి వారే ఉండాలి.. మరే ఆలోచనా ఉండకూడదు.. మదినిండా గోవిందా.. గోవిందా.. మానేసి ఇలాంటి పనికిమాలిన మాటలు, అర్ధం పర్థం లేని అద్దే పలుకులు అవసరమా అని ఇంకొంతమంది నెటిజన్లు శివాజీకి చివాట్లు పెడుతున్నారు.