Begin typing your search above and press return to search.

యాత్రలన్నీ బాబులవే... అచ్చెన్న ఏం చేయాలి మాస్టారూ...?

పేరుకు ఏపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు ఉన్నారా అన్న మాట కూడా ఉంది. ఏపీలో బీజేపీకి పురంధేశ్వరి ప్రెసిడెంట్ గా ఉన్నారు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 3:15 AM GMT
యాత్రలన్నీ బాబులవే... అచ్చెన్న ఏం చేయాలి మాస్టారూ...?
X

తెలుగుదేశం జాతీయ పార్టీయా అంటే కేంద్ర ఎన్నికల సంఘం రికార్డులలో చూస్తే ఒక ప్రాంతీయ పార్టీగానే ఉంది. జాతీయ పార్టీలలో కొత్తగా ఆప్ చేరింది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీ రెండుగా విభజించబడిన తరువాత చంద్రబాబు రెండు చోట్లా పార్టీ అంటూ జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. అయితే జాతీయ పార్టీగా ఉండాలంటే కనీసం నాలుగు రాష్ట్రాలలో పోటీ చేయాలి. ఒక్కో చోట ఆరు శాతం ఓట్లతో పాటు కనీసంగా ఇద్దరు ఎమ్మెల్యేలు అయినా గెలిపించుకోవాలి.

కానీ టీడీపీ ఏపీ తెలంగాణాకు మాత్రమే పరిమితం అయింది. దాంతో ఈసీ నిబంధలన ప్రకారం జాతీయ హోదా అయితే ఈ రోజుకు లేదు. కానీ చంద్రబాబు జాతీయ ప్రెసిడెంట్, నారా లోకేష్ బాబు జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏపీకి అచ్చెన్నాయుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు. తెలంగాణాకు కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు.

అయితే ఏపీలోనే టీడీపీకి పట్టు ఎక్కువగా ఉంది. ఆశలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో చంద్రబాబు లోకేష్ బాబు గట్టిగానే తిరుగుతున్నారు. లోకేష్ పాదయాత్ర యువగళం పేరిట చేస్తున్నాబు. బాబు జిల్లాల టూర్లు చేస్తున్నారు. మధ్య మధ్యలో పాదయాత్రలు చేస్తున్నారు. మరి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏమి చేయాలన్నది చర్చగానే ఉంది.

పేరుకు ఏపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు ఉన్నారా అన్న మాట కూడా ఉంది. ఏపీలో బీజేపీకి పురంధేశ్వరి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమె ఏపీ అంతా చురుగ్గా తిరుగుతున్నారు. అలాగే వామపక్షాలకు ఏపీ వరకూ కార్యదర్శులు ఉన్నారు. వారు కూడా పార్టీని మొత్తం చూసుకుంటారు.

అచ్చెన్న మాత్రం శ్రీకాకుళంలోనే ఉంటున్నారు. లేకపోతే చంద్రబాబు వెంట కనిపిస్తారు. బీసీ నేతగా ఉన్న అచ్చెన్నాయుడు చేత పాదయాత్ర చేయిస్తే టీడీపీకి బీసీ పార్టీగా మైలేజ్ వచ్చేను అన్న మాట కూడా ఉంది. కానీ అచ్చెన్నాయుడుని మాత్రం జిల్లా ప్రెసిడెంట్ కి ఎక్కువ ఏపీ ప్రెసిడెంట్ కి తక్కువ అన్నట్లుగా చేశారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

గతంలో కళా వెంకటరావు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు చంద్రబాబు ఒక్కరే పార్టీలో పెద్దగా ఉండేవారు. దాంతో ఎంతో కొంత కళాకు వెసులుబాటు ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. ఇపుడు చినబాబు రంగ ప్రవేశం చేయడంతో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఆరవ వేలుగా మారిందా లేక ఇంకా ఏదైనా ఉదాహరణ చెప్పాలా అన్న చర్చ కూడా మొదలైంది. మొత్తానికి అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అని టెక్నికల్ గా చూపించి ఉత్తరాంధ్రాలో బీసీలను మచ్చిక చేసుకునే వ్యూహం తప్పించి ఆయనకు అచ్చమైన అధికారాలు పార్టీ తరఫున ఫోకస్ అయ్యేలా కార్యక్రమాలు లేవా అన్నదైతే పార్టీలో ఉంది అని అంటున్నారు.