Begin typing your search above and press return to search.

మోడీ ఒక్క మాటతో చంద్ర దరహాసం

అమరావతి కేవలం నగరం కాదు మహా శక్తి అని కొనియడారు. పుణ్య భూమి అని కూడా మోడీ కీర్తించారు.

By:  Tupaki Desk   |   2 May 2025 3:25 PM
మోడీ  ఒక్క మాటతో చంద్ర దరహాసం
X

ఏపీ సీఎం చంద్రబాబు తరచూ ఒక మాట అంటూ ఉంటారు. అయితే ఆయన అన్న మాటనే దేశానికి పెద్ద ప్రధాని నరేంద్ర మోడీ నోట వినిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు మోడీ శ్రీకారం చుట్టిన సందర్భంగా అదే జరిగింది.

ఎపుడూ చంద్రబాబు అనే మాట మోడీ పలకడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అదే సమయంలో సభా వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మోము పూర్తిగా ఆనందంతో కనిపించింది. ఇంతకీ మోడీ ఏమన్నారు అంటే అమరావతి ప్రాశస్త్యం గురించి చెబుతూ ఇంద్రుడి రాజధాని పేరు అమరావతి అని ఏపీ రాజధాని కూడా అంతటి విఖ్యాతి గడించినదని అన్నారు.

అమరావతి కేవలం నగరం కాదు మహా శక్తి అని కొనియడారు. పుణ్య భూమి అని కూడా మోడీ కీర్తించారు. అంతే కాదు అమ్మ వారు కొలువున ప్రాంతమని వీరభద్రస్వామి అమరేశ్వరుడు ఆశీస్సులు ఉన్న నేల అని చారిత్రాత్మక పురాణేతిహాసాల గాధలను గుర్తు చేస్తూ మాట్లాడారు.

అంతే కాదు మూడేళ్ళలో అమరావతి రాజధానిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని ఆయన దక్షత పైన తనకు పూర్తి నమ్మకం ఉందని కూడా సభా వేదిక మీద నుంచే మోడీ ధృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. అదే విధంగా అమ్రావతి రాజధాని అనుకున్న సమయానికి పూర్తి అయితే ఏపీ డీజీపీ ఊహించని విధంగా ఉంటుందని ఆ అద్భుతమైన ఆర్ధిక ప్రగతిని తాను ముందుగానే ఊహిస్తున్నాను అని కూడా ప్రధాని చెప్పారు.

అమరావతిని ఏకంగా ఏపీకి గ్రోత్ ఇంజన్ అని కూడా చెప్పారు. ఇదే మాట ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ ఉంటారు. ఇపుడు మోడీ కూడా చంద్రబాబు మాటనే బలపరచారు. అంతే కాదు చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ప్రశంసించారు. అదే విధంగా ఏపీ సరైన దారిలోనే ఇపుడు ముందుకు సాగుతోంది అని ఆయన కితాబు ఇచ్చారు.

దాంతో బాబు విజన్ కి మోడీ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది అని అంటున్నారు. ఇకపోతే మోడీ అరగంటకు పైగా ప్రసంగం చేసారు. అందులో అత్యధిక భాగం అమరావతి చుట్టూనే తిరిగింది. అదే సమయంలో ఏపీ కేంద్రంలోనూ దేశంలోనూ జరిగే అభివృద్ధిలో ఎంత ముఖ్యంలో కూడా మోడీ సభా సాక్షిగా వివరించిన తీరు కూడా ఏపీ పాలకులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర అంటోంది. కేంద్రం వికసిత్ భారత్ అంటోంది. ఈ స్వర్ణాంధ్ర నినాదం దేశంలో వికసిత్ భారత్ కి ఊతమిస్తుందని మోడీ భావిస్తున్నారు.

ఇక సభలో మోడీ బాబుతో అలాగే పవన్ తో ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించారు. చంద్రబాబుని ప్రియమిత్రుడు అని సంభోదిస్తూనే పవన్ మీద కూడా ప్రత్యేక అభిమానాన్ని వాత్సల్యాన్ని చూపించారు. ఏది ఏమైనా మోడీకి ఏపీ మీద ఫోకస్ పెరిగింది. చంద్రబాబు దక్షత మీద నమ్మకం పెరిగింది. ఏపీ రేపటి భారత్ కి అత్యంత కీలకం అని ఆయన భావిస్తూ దానినే సభలో కూడా జనం ముందు ఉంచారు. చంద్రబాబు ముఖంలోనూ అనందం వెల్లి విరిసేలా చూశారు.