వైద్యరంగంలో AI విప్లవం.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ముందే చెక్!
ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్) టెక్నాలజీ రోజురోజుకూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఎడిటెడ్ వీడియోలతో మాయ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
By: Tupaki Desk | 2 May 2025 6:45 PMఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్) టెక్నాలజీ రోజురోజుకూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఎడిటెడ్ వీడియోలతో మాయ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే, ఇప్పుడు వైద్యరంగంలోనూ ఇది విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి 20 దేశాల్లోని 50 లక్షల మంది ప్రజల ఛాతీ ఎక్స్‌రేలను పరీక్షించారు. ఆశ్చర్యకరంగా, ఇది కొందరిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను విజయవంతంగా గుర్తించి వారిని అప్రమత్తం చేసింది. ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఏఐ ఈ వినూత్న అప్లికేషన్ వైద్యరంగంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. లక్షలాది మంది ఎక్స్‌రేలను తక్కువ సమయంలో విశ్లేషించగల సామర్థ్యం ఏఐకి ఉండడంతో వైద్యులు మరింత ఖచ్చితత్వంతో, వేగంగా రోగులను గుర్తించగలుగుతున్నారు. ముఖ్యంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించే అవకాశం లభిస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌లో ఉపయోగించిన ఏఐ అల్గోరిథమ్‌లు ఎక్స్‌రే చిత్రాల్లోని సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించగలవు. డాక్టర్లు కొన్నిసార్లు గుర్తించలేకపోయే క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇది ముందుగానే పసిగట్టగలదు. దీనివల్ల, వ్యాధి ముదిరేలోపే చికిత్స ప్రారంభించి రోగి ప్రాణాలను కాపాడే అవకాశం పెరుగుతుంది. ఈ విజయం కేవలం ఒక ప్రారంభం మాత్రమేనని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ధి చెంది ఇతర రకాల క్యాన్సర్‌లను, వివిధ వ్యాధులను కూడా ముందుగానే గుర్తించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా వైద్యరంగంలో ఏఐ ఒక కీలక పాత్ర పోషించనుంది.