Begin typing your search above and press return to search.

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్ - ఫ్లిప్ 5 లాంచ్... స్పెషాలిటీస్ ఇవే!

గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 5 ఫోన్, రెండు వేరియంట్లలో ల‌భిస్తుంది.

By:  Tupaki Desk   |   27 July 2023 1:31 PM GMT
శాంసంగ్‌  గెలాక్సీ జెడ్‌  ఫోల్డ్ - ఫ్లిప్ 5 లాంచ్... స్పెషాలిటీస్  ఇవే!
X

దక్షిణ కొరియా కు చెందిన మొబైల్ దిగ్గజం "శాంసంగ్‌"కు భారతదేశం లో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో... నిత్యం సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా మరో రెండు 5జీ స్మార్ట్‌ ఫోన్‌ లను రిలీజ్ చేసింది.

అవును... శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ ప్యాక్డ్ ఈవెంట్‌ లో శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5, శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5 ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ లను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్స్ ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.

గ్లోబ‌ల్ టెక్ దిగ్గజం ఆపిల్ ఐ-ఫోన్ల త‌ర్వాత "మేడిన్ ఇండియా" స్కీమ్‌ లో చేరేందుకు ముందుకొచ్చింది ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్. వ‌చ్చేనెల 18న భార‌త్ మార్కెట్లో శాంసంగ్ త‌న గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్‌5, గెలాక్సీ ఫ్లిప్ 5 ఫోన్లను ఆవిష్కరించనుంది. ఈ మేరకు జూలై 27 నుంచి ఫోన్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది.

ఇందులో భాగంగా... గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 5 ఫోన్, రెండు వేరియంట్లలో ల‌భిస్తుంది. బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్‌ - 256 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజీ వేరియంట్ లో దొరుకుతుంది. దీని ధర రూ.99,999 గా ఉంది. ఇదే సమయం లో 8జీబీ ర్యామ్ - 512 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజీ తో దొరుకుతోంది. దీని ధర రూ.1,09,999 ప‌లుకుతుంది.

ఇదే క్రమంలో... శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటు లో ఉంటుంది. 12 జీబీ ర్యామ్ - 256 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్ లో దొరుకుతోంది. వీటి ధర రూ.1,54,999 గా ఉండగా... 12 జీబీ ర్యామ్ - 512 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజీ తో మరొక వేరియెంట్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,54,999 గా ఉంది.

ఇదే సమయం లో 12 జీబీ ర్యామ్ - ఒకటిగా బైట్ జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజీ వేరియెంట్ ధర... రూ.1,84,999 ప‌లుకుతుంది. ఈ ఫోన్ ఐసీ బ్లూ, క్రీమ్‌, ఫాంట‌మ్ బ్లూ క‌ల‌ర్స్ ఆప్షన్లలో ల‌భిస్తుంది. ఇక ఈ ఫోన్స్ ప్రీ బుకింగ్ చేసిన వారికి రూ. 23,000 విలువైన స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయని కంపెనీ తెలిపింది!