Begin typing your search above and press return to search.

ఈ రెస్టారెంట్లో తినాలంటే... నాలుగేళ్ల అడ్వాన్స్ బుక్కింగ్ మస్ట్!

పబ్ లో ఆదివారం వెళ్లి ఒక స్పెషల్ ఫుడ్ తినాలంటే సుమారు నాలుగేళ్ల అడ్వాన్స్ బుక్కింగ్ అవసరం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2023 1:13 PM GMT
ఈ రెస్టారెంట్లో తినాలంటే... నాలుగేళ్ల అడ్వాన్స్  బుక్కింగ్  మస్ట్!
X

సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే కుటుంబ సమేతంగా రెస్టారెంట్లకు వెళ్తుంతారు.. మరికొంతమంది బార్లకు, పబ్ లకూ వెళ్తుంటారు. అందులో భాగంగా కాస్త ఫేమస్ రెస్టారెంట్లూ, పబ్ లూ అయితే అడ్వాన్స్ బుక్కింగ్ కంపల్సరీ! అది కూడా ఒకరోజు కాకపోతే రెండు రోజులు.. మహా అయితే మూడు రోజులు అడ్వాన్స్ బుక్కింగ్ ఉండొచ్చు.

మరీ ఫేమస్ పబ్ లు అయితే పోనీ వారం రోజుల అడ్వాన్స్ బుక్కింగ్ అవసరం పడొచ్చు. కానీ... ఇప్పుడు చెప్పబోయే పబ్ లో ఆదివారం వెళ్లి ఒక స్పెషల్ ఫుడ్ తినాలంటే సుమారు నాలుగేళ్ల అడ్వాన్స్ బుక్కింగ్ అవసరం అని అంటున్నారు. ఏమిటో.. అంత స్పెషల్.. అసలు ఆ హోటల్ ఎక్కడ ఉంది.. అనేది ఇప్పుడు చూద్దాం!

యూకే లోని బ్రిస్టల్‌ లో ఉన్న "ది బ్యాంక్‌ టావెర్న్‌" అనే చిన్న పబ్‌ లో ఆదివారం ఆహారాన్ని ఆస్వాదించడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే.. ఈ పబ్‌ లో ప్రత్యేకంగా సిద్ధం చేసే "సండే రోస్ట్‌ లు" కోసం నాలుగేళ్ల వేచి ఉండాలట. ఈ రోస్టుల్లో బీఫ్‌, పోర్క్‌ బెల్లీ, ల్యాంబ్‌, దినుసులతో కూడిన ప్రత్యేకమైన వంటకాల ను వడ్డిస్తారు.

దీంతో డోజీ లోని రెస్టారెంట్‌ బుకింగ్‌ మేనేజ్‌ మెంట్‌ నిపుణులు యూకే లోనే సుదీర్ఘ వెయిటింగ్‌ లిస్టు ఉన్న పబ్‌ గా దీన్ని గుర్తించారట. 2018లో బ్రిస్టల్‌ గుడ్‌ ఫుడ్‌ అవార్డ్స్‌ లో ఉత్తమ సండే లంచ్‌ గా ఈ "సండే రోస్ట్‌" ఎంపికైందట. ఇదే క్రమంలో 2019లో అబ్జర్వర్‌ ఫుడ్‌ మంత్లీ అవార్డును గెలుచుకుంది.

19వ శతాబ్దం నాటి ఈ పబ్ కోవిడ్ సమాయం లో మరిన్ని సేవలందించిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... కొవిడ్‌ సమయం లో దేశవ్యాప్తంగా చాలా పబ్‌ లు, రెస్టారెంట్లను మూసివేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పబ్‌ లో "సండే రోస్ట్‌ ల" కోసం జరిగిన ముందస్తు బుకింగ్స్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ మరింత పెరిగిందట. ఫలితంగా ఇప్పుడు వీటిని ఆస్వాదించడానికి నాలుగేళ్లు వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు!