స్పై కథల్లో బికినీ హీట్!
ఇప్పుడు ఆగస్టు 14వ తేదీన స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన వార్-2 రిలీజ్ కానుంది. మరో మూవీ ఆల్ఫా రూపొందుతోంది.
By: Tupaki Desk | 20 May 2025 7:22 PM ISTబాలీవుడ్ క్రేజీ యూనివర్స్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఒకటి. కొన్నేళ్ల క్రితం ఆ యూనివర్స్ స్టార్ట్ అవ్వగా.. ఇప్పటికే ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆదిత్య చోప్రా నిర్మించిన ఆ మూవీలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఆగస్టు 14వ తేదీన స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన వార్-2 రిలీజ్ కానుంది. మరో మూవీ ఆల్ఫా రూపొందుతోంది.
అయితే YRF స్పై యూనివర్స్ లోని సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉండగా.. హీరోయిన్ బికినీ సీన్ అందులో ఒకటి. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ బికినీలతో గ్లామర్ షో చేసిన విషయం తెలిసిందే. వార్ మూవీ ఫస్ట్ పార్ట్ లో నటి వాణి కపూర్ బికినీలో కనిపించి సందడి చేశారు. తన స్పెషల్ అపీయరెన్స్ తో సినీ ప్రియులను మెప్పించారు.
షారుక్ ఖాన్ పఠాన్ మూవీలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే బికినీ డోస్ తో సినిమాను వేరే రేంజ్ కు తీసుకెళ్లారు. అప్పట్లో దీపిక బికినీ సీన్స్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరిగినా.. సినిమా వైపు అందరి దృష్టిని తిప్పాయి. ఇప్పుడు వార్ విషయంలో కూడా అదే జరుగుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కియారా బికినీ విజువల్స్ వైరల్ గా మారడంతో.. యష్ రాజ్ ఫిల్మ్స్.. మూవీపై బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారని నెటిజన్లు చెబుతున్నారు. అప్పుడు దీపిక.. ఇప్పుడు కియారా అంటూ బికినీ పిక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి నెట్టింట ఇప్పుడు దీపిక, కియారాల బికినీ చిత్రాలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.
దీపిక లాగానే కియారా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారని, సినిమాపై బజ్ పెంచుతున్నారని నెటిజన్లు చెబుతున్నారు. ఆమెలానే హిట్ కూడా అందుకునేలా కనిపిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి అలా YRF స్పై యూనివర్స్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ ఎప్పటికప్పుడు బికినీలతో హాట్ టాపిక్ గా మారుతున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
ఏదేమైనా.. వార్-2 మూవీ టీజర్ లో కియారా బికినీ ఫ్రేమ్ హైలెట్ అవుతుంది. గ్రీన్ కలర్ బికినీలో అమ్మడు సూపర్ అని అనేక మంది నెటిజన్లు ఇప్పుడు కొనియాడుతున్నారు. బికినీలో కియారా వేరే లెవెల్ లో ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు. సినిమాకు కియారా గ్లామర్ ఫ్యాక్టర్ ను యాడ్ చేయనున్నట్లు క్లియర్ గా తెలుస్తోందని అంటున్నారు.
