హాలీవుడ్ ఎంట్రీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సర్ ప్రైజ్!
తాజాగా తారక్ మళ్లీ మైఖెల్ కి టచ్ లోకి వెళ్లడంతో పాటు కొంత మంది హాలీవుడ్ మేకర్స్ తోనే తారక్ మాట మంతి చేసినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 21 May 2025 2:23 PM ISTబాలీవుడ్ తరహాలోనే యంగ్ టైగర్ ఎన్టీర్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తున్నాడా? తారక్ నుంచి అభిమానులు మరో బిగ్ సర్ ప్రైజ్ ఆశించ వచ్చా? అంటే అవుననే ప్రచారం బాలీవుడ్ మీడియాలో మొదలైంది. తారక్ 'వార్ 2'తో బాలీవుడ్ లో లాంచ్ అవుతాడని అస్సలు ఊహించలేదు. ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. నేరుగా 'వార్ 2' సెట్స్ లో జాయిన్ అయిన తర్వాతే విషయం అర్దమైంది.
అదీ హీరోగా కాకుండా తారక్ అక్కడ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించడం అన్నది అభిమానులకు బిగ్ షాక్. దీంతో ఆ పాత్ర ఎలా ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తెర పడా లంటే ఆగస్టు వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇక టైగర్ హాలీవుడ్ ఎంట్రీ విషయానికి వస్తే ఈ మధ్య తారక్ హాలీ వుడ్ నటులతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు వినిపిస్తుంది. 'బ్లాంక్ పాంథర్' నటుడు మైఖెల్ జోర్డాన్ తో తారక్ కి మంచి స్నేహం ఉంది.
'నాటు నాటు నాటు' పాటకు ఆస్కార్ వచ్చిన సమయంలో స్నేహితుడు తారక్ గురించి ప్రత్యేకమైన పోస్ట్ పెట్టి తమ మధ్య బాండింగ్ ని రివీల్ చేసాడు. అప్పుడే ఇద్దరు ఎంత క్లోజ్ అన్నది అర్దమైంది. తాజాగా తారక్ మళ్లీ మైఖెల్ కి టచ్ లోకి వెళ్లడంతో పాటు కొంత మంది హాలీవుడ్ మేకర్స్ తోనే తారక్ మాట మంతి చేసినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తారక్ కు ఇష్టమైన గేమ్ ఏంటి? అన్నది ఇంతవరకూ ఎవరూ తెలియదు.
ఈ విషయాన్ని కూడా మైఖెల్ బాస్కెట్ బాల్ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ ప్రచారం నేపథ్యంలో తారక్ హాలీవుడ్ కి వెళ్లాలంటూ అభిమానులు కూడా పోస్టులు షురూ చేస్తున్నారు. ఇంతటి ప్రతిభా వంతుడు భారత్ కే పరిమితం కాకూడదని ప్రపంచ దేశాల్ని తన నటనతో మెప్పించాలని ఆశిస్తున్నారు. ఈ ప్రచారం నిజమవ్వాలని ఆశిద్దాం.
