Begin typing your search above and press return to search.

యాత్ర 2: సోనియా పాత్ర.. ఆమె ఎవరంటే?

యాత్ర 2లో సోనియా క్యారెక్టర్ ఎందుకు వస్తోంది అనే విషయం గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

By:  Tupaki Desk   |   7 Nov 2023 9:45 AM GMT
యాత్ర 2: సోనియా పాత్ర.. ఆమె ఎవరంటే?
X

గత ఎన్నికలలో యాత్ర సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా తెరపైకి వచ్చిన ఆ సినిమా మేకింగ్ పరంగా కూడా ప్రశంసలు అందుకుంది. ఇక దర్శకుడు మహి వి రాఘవ ఇప్పుడు యాత్ర 2 సినిమాలో వైఎస్ జగన్ సంబంధించిన అంశాలను హైలైట్ చేయబోతున్నాడు.


అయితే ఈ సినిమాలోని క్యాస్ట్ తోనే అంచనాలను పెంచేస్తున్నారు. ఇంకా ప్రొడక్షన్ పరంగా కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాలను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. 'యాత్ర 2'ని త్రీ ఆటం లీవ్స్, వి సెల్యులాయిడ్ మరియు శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా, వైఎస్ జగన్ పాత్రను కోలీవుడ్ యువ హీరో జీవా పోషిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే చంద్రబాబు పాత్రకు సంబంధించి లుక్ విడుదల చేశారు. ఆయన పాత్రలో మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. ఇక ‘యాత్ర 2’లో సోనియా పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారు. ఆమె క్యారెక్టర్ పోస్టర్‌ను చిత్ర నిర్మాతలు మంగళవారం విడుదల చేశారు. జర్మనీలో జన్మించిన సుజానే యాడ్-కమర్షియల్, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ టీవీ సీరియల్స్ చేసింది.

ఇక సోనియా పాత్రలో ఆమె ఎలా నటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. యాత్ర 2లో సోనియా క్యారెక్టర్ ఎందుకు వస్తోంది అనే విషయం గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ రూపొందింది. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వైఎస్‌ఆర్‌ తనయుడు వైఎస్‌ జగన్‌ ప్రజానాయకుడిగా ఎలా ఎదిగాడో ‘యాత్ర 2′ చూపించనున్నారు.

2009 నుండి 2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు కూడా యాత్ర 2లో హైలెట్ కానున్నాయి. ‘యాత్ర’ ఫిబ్రవరి 8, 2019న విడుదలైంది. ఇప్పుడు, ‘యాత్ర 2’ కూడా అదే తేదీ, ఫిబ్రవరి 8, 2024న విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈసారి ఎన్నికల వాతావరణం లో సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో చూడాలి.