Begin typing your search above and press return to search.

రూల్స్ రంజన్ అతన్ని కాపాడుతుందా..?

లేటెస్ట్ గా రూల్స్ రంజన్ అంటూ మరో సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

By:  Tupaki Desk   |   11 Sep 2023 11:30 AM GMT
రూల్స్ రంజన్ అతన్ని కాపాడుతుందా..?
X

యువ హీరోల్లో సక్సెస్ మీటర్ లో చాలా వెనుక పడ్డాడు కిరణ్ అబ్బవరం. మొదటి రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించగా ఆ తర్వాత అతనికి అసలు పరీక్ష మొదలైంది. వరుస సినిమాలు చేస్తున్నా యంగ్ హీరోకి లక్ కలిసి రావట్లేదు. ఈ క్రమంలో ఈ ఇయర్ మొదట్లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా హిట్ అయ్యింది. 3 ఫ్లాపుల తర్వాత ఒక హిట్ హమ్మయ్య అనుకునేసరికి మళ్లీ మరో ఫ్లాప్ పలకరించింది. కథల ఎంపికలో లోపమా లేక అన్ లక్కీనా అన్నది తెలియదు కానీ కిరణ్ అబ్బవరం కెరీర్ రిస్క్ లోనే ఉంది.

అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతూనే ఉన్నాడు కిరణ్. లేటెస్ట్ గా రూల్స్ రంజన్ అంటూ మరో సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. లైఫ్ లో అన్నీ రూల్స్ పాటిస్తూ రూల్స్ పాటించాలని చెబుతూ ఉండే హీరో లైఫ్ లో అసలు రూల్స్ లేని విధంగా మారి రిస్క్ లో పడతాడు. అసలు ఈ రూల్స్ రంజన్ కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఎంటర్టైన్ చేస్తుంది అన్నది చూడాలి.

హిట్ వస్తే ఎంత ఖుషిగా ఉంటుందో ఫ్లాప్ వస్తే అంతే నిరుత్సాహంగా ఉంటుంది. వినరో భాగ్యము సినిమా ముందు 3 ఫ్లాపులతో దాదాపు కెరీర్ ముగిసింది అనుకునే లోగా మళ్లీ హిట్ తో తన సత్తా చాటాడు కిరణ్ అబ్బవరం. రూల్స్ రంజన్ తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న కిరణ్ అనుకున్న విధంగా సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.

తను ఎంచుకున్న ప్రతి కథలో తన వరకు బాగానే చేస్తున్నా ఆడియన్స్ కు కనెక్ట్ అవడంలో వెనక పడుతున్నాడు కిరణ్ అబ్బవరం. అయితే రూల్స్ రంజన్ సినిమా ట్రైలర్ మాత్రం ఎంగేజింగ్ గా ఉంది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఆమె బెదురులంక సినిమాతో హిట్ అందుకుంది. మరి ఈ సినిమాకు ఆమె లక్ కలిసి వస్తుందేమో చూడాలి. పోటీగా రాం స్కంద వస్తుంది. మాస్ యాక్షన్ మూవీకి ఈ రూల్స్ రంజన్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కు ఎక్కుతుందా లేదా అన్నది రిలీజ్ నాడు తెలుస్తుంది.