Begin typing your search above and press return to search.

`వార్ 2` లీకుల‌తోనే భేజారు

ఆన్ లొకేష‌న్ మొబైల్ ఫోన్ల వినియోగంపైనా ఆంక్ష‌లు విధిస్తారు కాబ‌ట్టి లీకుల‌కు ఆస్కారం ఉండ‌దు.

By:  Tupaki Desk   |   17 April 2024 5:20 AM GMT
`వార్ 2` లీకుల‌తోనే భేజారు
X

ఆన్ లొకేష‌న్ నుంచి ఫోటోలు వీడియోలు లీక‌వ్వ‌కుండా, అలాగే త‌మ సినిమాల కాన్సెప్టు తెలియ‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టంలో త‌మిళ ద‌ర్శ‌కుడు ఎస్‌.శంక‌ర్ ఘ‌నాపాటి అని చెబుతారు. ఆ త‌ర్వాత ఎస్.ఎస్.రాజ‌మౌళి అదే ఫార్ములాను అనుస‌రించారు. ఆ ఇద్ద‌రు దిగ్గ‌జ ద‌ర్శ‌కుల సినిమాల నుంచి లీకులు అంద‌డం దాదాపు అసాధ్యం. ఆన్ లొకేష‌న్ మొబైల్ ఫోన్ల వినియోగంపైనా ఆంక్ష‌లు విధిస్తారు కాబ‌ట్టి లీకుల‌కు ఆస్కారం ఉండ‌దు.

కానీ ఇది అంద‌రికీ సాధ్య‌మా? ఇప్పుడు `బ్ర‌హ్మాస్త్ర` ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ త‌న కెరీర్ బెస్ట్ సినిమాని తెర‌కెక్కిస్తూ కూడా కేర్‌లెస్ గా ఉన్నాడ‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ప్ర‌స్తుతం అత‌డు ఎన్టీఆర్- హృతిక్ రోష‌న్ లాంటి గొప్ప స్టార్ల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం వార్ 2 తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ నుంచి ఇప్పుడు ఫోటోలు లీక్ కావ‌డం షాకిస్తోంది. వార్ 2 సెట్స్ నుండి లీక్ అయిన ఫోటోల‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పూర్తిగా యాక్షన్ మోడ్‌లో క‌నిపిస్తున్నారు. తాజా లీక్డ్ ఫోటోల‌ను బ‌ట్టి వారి పాత్ర‌లు ఎలాంటివి అనేది అభిమానులు గెస్ చేస్తున్నారు.

హృతిక్ ఒక సీరియ‌స్ మిష‌న్ గురించి ఆలోచిస్తున్న స్పై త‌ర‌హాలో క‌నిపిస్తున్నాడు. అత‌డి చేతిలో తేనీటి గ్లాస్ క‌నిపిస్తోంది. బ్లూ టైట్ టీష‌ర్ట్ పై బ్లాక్ కోట్ ధ‌రించి ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ్లాక్ టీష‌ర్ట్ స్పోర్ట్స్ మ‌ల్టీపాకెట్ ప్యాంట్ లో చాలా క్యాజువ‌ల్ గా క‌నిపిస్తున్నా కానీ, అతడి ఫిట్ లుక్ మ‌రో లెవ‌ల్లో ఎలివేట్ అవుతోంది. చూస్తుంటే ఇది ఏదైనా యాక్ష‌న్ షెడ్యూల్ అనుకోవాలా? లేక ఇంకేదైనానా? అన్న‌ది అర్థం కాని ప‌రిస్థితి. ఇటీవ‌ల ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్ట‌గానే ఈసారి షెడ్యూల్‌లో యాక్ష‌న్ సీన్స్ తీస్తున్నార‌ని లేదూ పాట చిత్రీకరిస్తున్నార‌ని ర‌కర‌కాలుగా ప్ర‌చార‌మైంది. కానీ అస‌లు షూట్ ఏం జ‌రుగుతోంది? అనేదానిపై స‌రైన స‌మాచారం లేదు. సెట్ నుంచి ఫోటో లీకులు అభిమానుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయి. ఏది ఏమైన లీక్డ్ ఫోటోలు నంద‌మూరి అభిమానుల్లో ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌ల‌కు తావిచ్చాయి. కానీ ఇలా ముందే లీకులిచ్చేస్తే, ఆ త‌ర్వాత సినిమా లుక్ ల లాంచ్ లు, టీజ‌ర్ లాంచ్ ల‌పై ఆస‌క్తి స‌న్న‌గిల్లుతుంద‌నే ఆందోళ‌న ఒక వ‌ర్గంలో వ్య‌క్త‌మ‌వుతోంది. య‌ష్ రాజ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.