Begin typing your search above and press return to search.

ఎలివేషన్ అదిరింది.. టెన్షన్ మొదలైంది..!

ఈ ఎలివేషన్ కూడా తారక్ పాత్ర గురించే అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. టైగర్ 3 లో అది పూర్తిగా కన్ఫర్మ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 5:35 AM GMT
ఎలివేషన్ అదిరింది.. టెన్షన్ మొదలైంది..!
X

సల్మాన్ ఖాన్ లీడ్ రోల్ లో మనీష్ శర్మ డైరెక్షన్ లో వచ్చిన సినిమా టైగర్ 3. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా చివర్లో వార్ 2 కి సంబంధించిన ట్విస్ట్ కూడా ఇచ్చారు మేకర్స్. అదే ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి వార్ 2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే హృతిక్ ని చూపిస్తూ విలన్ గురించి ఎలివేషన్ ఇచ్చారు. ఇండియాకు ఒక కొత్త శత్రువు తయారయ్యాడు. ఇప్పటివరకు ఎవరు చూడని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అతడు ఎలా ఉంటాడో తెలియదు, పేరు కూడా తెలియదు పూర్తిగా చీకట్లో ఉంటాడు. అతడిని ఎదుర్కోవాలంటే నువ్వు కూడా చీకట్లోనే వెళ్లాలంటూ హృతిక్ కి చెప్పే సీన్ ఉంది.

అతడితో పోరాటం మరణం కంటే ప్రమాదం అంటూ ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది. ఎన్.టి.ఆర్ పేరు చెప్పకపోయినా వార్ 2 లో నెగిటివ్ షేడ్స్ లో ఎన్.టి.ఆర్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ ఎలివేషన్ కూడా తారక్ పాత్ర గురించే అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. టైగర్ 3 లో అది పూర్తిగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఎలివేషన్ ఎంత బాగున్నా టైగర్ 3 రిజల్ట్ చూశాక వార్ 2 కూడా ఇలానే ఉంటే ఎలా అనే డౌట్ పడుతున్నారు తారక్ ఫ్యాన్స్.

వార్ 2 ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ అనుమానాలు ఏవి పెట్టుకోవక్కర్లేదు. హృతిక్ ఎన్.టి.ఆర్ ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే. వార్ 2 తో అఫీషియల్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. వార్ 2 లో చేసేది విలన్ రోల్ అయినా తన మార్క్ నటనతో అదరగొట్టాలని చూస్తున్నాడు. ఎన్.టి.ఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

దేవర తర్వాత వార్ 2 సినిమాకే డేట్స్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా తో పాటుగా దేవర్ 2 ని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ వరుస క్రేజీ సినిమాలు ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తున్నాయి. RRR తో పాన్ ఇండియా స్టార్ గానే కాదు గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్.టి.ఆర్ వార్ 2 తో పాటుగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాలతో తన రేంజ్ మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు.