Begin typing your search above and press return to search.

వార్ 2.. ఏం నడుస్తోంది?

వార్ మూవీ హిట్ కావడంతో వార్ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. హృతిక్ రోషన్ కూడా తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై చాలా ఆసక్తి చూపించారు.

By:  Tupaki Desk   |   27 May 2024 2:30 PM GMT
వార్ 2.. ఏం నడుస్తోంది?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టారు. వీటిలో దేవర మూవీ కంప్లీట్ దశకి వచ్చింది. దీని తర్వాత తారక్ బాలీవుడ్ లోకి వార్ 2 చిత్రం ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. గత నెల ముంబైలో జరిగిన షెడ్యూల్ లో తారక్ పాల్గొన్నాడు.

ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలని అక్కడ తెరకెక్కించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వార్ 2 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధం అవుతోంది. హృతిక్ రోషన్ తో పాటు మరో హీరోగా తారక్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. భారీ మల్టీ స్టారర్ మూవీగా రెడీ అవుతోన్న వార్2ని 2025 ఆగష్టుకి 14న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందంట. లాంగ్ షెడ్యూల్ ఈ సారి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయబోతున్నారంట. హృతిక్ రోషన్ తో పాటు తారక్ కూడా ఈ షెడ్యూల్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారంట. ఇద్దరి మధ్య పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఈ షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

వార్ మూవీ హిట్ కావడంతో వార్ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. హృతిక్ రోషన్ కూడా తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై చాలా ఆసక్తి చూపించారు. వీరిద్దరిని బిగ్ స్క్రీన్ పై చూస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి తారక్ అభిమానుల్లో కూడా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్ లో తారక్ కి ఇమేజ్ పెరిగింది. దీంతో వార్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

వార్ 2 హిట్ అయితే యష్ రాజ్ బ్యానర్ లోనే తారక్ సోలోగా ఒక స్పై థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వార్ 2 కాకుండా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో కూడా కూడా తారక్ ఓ హిందీ మూవీ చేయనున్నట్లు గతంలో టాక్ వినిపించింది. అది కన్ఫర్మ్ అయితే కచ్చితంగా ఇండియన్ సూపర్ స్టార్స్ లో తారక్ ఒకడుగా మారే అవకాశం ఉంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.