Begin typing your search above and press return to search.

'వార్-2' లో ఒక్క‌డే ఇద్ద‌రు..అది ఇత‌డేనా !

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ `వార్-2`తో షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హృతిక్ రోష‌న్ తో క‌లిసి న‌టిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   8 April 2024 7:30 AM GMT
వార్-2 లో ఒక్క‌డే  ఇద్ద‌రు..అది ఇత‌డేనా !
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ `వార్-2`తో షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హృతిక్ రోష‌న్ తో క‌లిసి న‌టిస్తున్నాడు. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తున్నాడు. అతి త్వ‌ర‌లోనే తార‌క్ షూటింగ్ లో పాల్గొంటాడు. అయితే ఇందులో తార‌క్ రోల్ పై ఇప్ప‌టికీ స‌రైన స్ప‌ష్ట‌త లేదు. హృతిక్ తో ధీటుగా ఆ పాత్ర ఉంటుందా? లేక తార‌క్ మ‌రో హీరోనా? అన్న‌ది తెలియ‌ని అంశం. మ‌రోవైపు రా ఏజెంట్ పాత్రలో న‌టిస్తున్న‌ట్లు బ‌ల‌మైన ప్ర‌చారం సాగినా అందులో క్లారిటీ లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి బాలీవుడ్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఇందులో తార‌క్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్లు కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. రెండు వేటిక‌వి ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన పాత్ర‌ల‌ని స‌మాచారం. అందులో ఒక‌టి పాజిటివ్ రోల్ అయితే మ‌రోటి నెగిటివ్ రోల్ అని అంటున్నారు. పాజిటివ్ రోల్ రా ఏజెంట్ అనుకుంటే...నెగిటివ్ రోల్ అన్న‌ది! హృతిక్ ని ఢీకొట్టేదే అవ్వ‌డానికి ఛాన్స్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఎన్టీఆర్ రెండో పాత్ర రివీల్ అవుతుందని అంటున్నారు. ఆ పాత్ర సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి. తార‌క్ షూటింగ్ కి హాజ‌రైతే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌స్తుతం తార‌క్ `దేవ‌ర` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చిన 16 నుంచి వార్ -2 సెట్స్ కి హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం. ఇది చిన్న షెడ్యూల్ కావ‌డంతో తార‌క్ పై కేవ‌లం ప‌ది రోజులే షూటింగ్ చేస్తార‌ని ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొంత గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ హాజ‌ర‌వ్వ‌నున్నారు. ఇక `వార్ -2`పై అంచ‌నాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్దరి కాంబినేష‌న్ లో సినిమా ప్ర‌క‌టించ‌గానే అంచ‌నాలు పీక్స్ లో మొద‌ల‌య్యాయి.

ఆ త‌ర్వాత ఒక్కో అప్ డేట్ అంచ‌నాల్ని రెట్టింపు చేసాయి. తార‌క్ సెట్స్ కి వెళ్ల‌డం మొద‌లైన నాటి నుంచి అవి ఊహ‌కి కూడా అంద‌వేమో. ఇప్ప‌టికే తార‌క్ కోసం ఎదురు చూస్తున్న‌ట్లు హృతిక్ రోష‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియాలో అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ అవుతుంది. ఈ స్పై యూనివ‌ర్శ్ చిత్రాన్ని య‌శ్ రాజ్ ఫిలింస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.