Begin typing your search above and press return to search.

వార్ 2 హృతిక్ కి ఎంత..? ఎన్టీఆర్ కి ఎంత..?

ఫైటర్ తో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపిస్తున్న హృతిక్ రోషన్ తన నెక్స్ట్ సినిమా వార్ 2 కి సన్నద్ధం అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 11:30 PM GMT
వార్ 2 హృతిక్ కి ఎంత..? ఎన్టీఆర్ కి ఎంత..?
X

ఫైటర్ తో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపిస్తున్న హృతిక్ రోషన్ తన నెక్స్ట్ సినిమా వార్ 2 కి సన్నద్ధం అవుతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన వార్ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వార్ సినిమా సక్సెస్ అవ్వడంతో వార్ 2 ని ప్రకటించారు. అయితే వార్ 2 లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ భాగం అవుతున్నాడు. హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్.టి.ఆర్ ఇద్దరు నువ్వా నేనా అనేలా ఢీ కొట్టబోతున్నారు. వార్ 2 లో ఈ ఇద్దరి స్టార్ ఫైట్ క్రేజీగా మారనుంది.

ఇంతకీ వార్ 2 కోసం ఎన్.టి.ఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు..? హృతిక్ కి ఎంత ఇస్తున్నారన్నది ఆసక్తి కరమైన చర్చగా మారింది. ఫైటర్ సినిమా కోసం హృతిక్ రోషన్ కు నిర్మాతలు 85 కోట్ల దాకా పారితోషికం ఇచ్చారట. ఇక వార్ 2 కి ఆ రేటు మరింత పెరిగినట్టు తెలుస్తుంది. దాదాపు వార్ 2 కి హృతిక్ రోషన్ 100 కోట్ల దాకా కోట్ చేస్తున్నాడని టాక్. స్టార్ ఆన్ డిమాండ్ అన్నట్టుగా హృతిక్ అడిగినంత ఇచ్చేందుకు యశ్ రాజ్ ఫిలింస్ రెడీ అవుతుంది.

అయితే వార్ 2 కోసం ఎన్.టి.ఆర్ కి కూడా అదే రేంజ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట. వార్ 2 సినిమాలో తారక్ నెగిటివ్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. సినిమా కోసం ఎన్.టి.ఆర్ కెరీర్ బెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటారని టాక్. తెలుగు సినిమాల్లో 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్ దేవర సినిమాకు దాదాపు ఆ రేటు పెరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తారక్ కూడా సినిమాకు 80 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుంది.

సో వార్ 2 లో ఎన్.టి.ఆర్ కి అదే రేంజ్ రెమ్యునరేషన్ అందించే అవకాశం ఉంది. హృతిక్ రోషన్, ఎన్.టి.ఆర్ ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2 సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్.టి.ఆర్ తన బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి తారక్ బాలీవుడ్ అరంగేట్రం ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది చూడాలి.