Begin typing your search above and press return to search.

'వార్ 2'లో యానిమ‌ల్ బ్యూటీ!

తాజా స‌మాచారం మేర‌కు ట్రిప్తి మోస్ట్ అవైటెడ్ వార్ 2లో న‌టించనుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   15 April 2024 4:51 AM GMT
వార్ 2లో యానిమ‌ల్ బ్యూటీ!
X

ట్రిప్తి దిమ్రి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో యువ‌హృద‌యాల‌ను గెలుచుకున్న ఈ బ్యూటీకి 'యానిమ‌ల్' బిగ్ బ్రేకింగ్ పాయింట్. బ్లాక్ బ‌స్ట‌ర్ యానిమ‌ల్ లో ర‌ణ‌బీర్ ప్రేయ‌సిగా వేడెక్కించే స‌న్నివేశాల్లో జీవించింది. ట్రిప్తి కి ఈ చిత్రం ఓవ‌ర్ నైట్ గేమ్ ఛేంజ‌ర్ గా మారింది. నిజానికి ట్రిప్తి కెరీర్ ప‌రంగా చాలా స్ట్ర‌గుల్ ని ఫేస్ చేసింది. చాలా సింగిల్ ఆల్బమ్స్ లో న‌టించి, కొన్ని సినిమాల్లో న‌టించినా రాని గుర్తింపు ట్రిప్తికి ఓవ‌ర్ నైట్ లో `యానిమ‌ల్` పాత్ర‌తో వ‌చ్చింది. ఈ సినిమా రిలీజ‌య్యాక ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఇప్ప‌టికిప్పుడు భారీ పాన్ ఇండియా సినిమాలకు ట్రిప్తి క‌మిట‌వుతోంది.

తాజా స‌మాచారం మేర‌కు ట్రిప్తి మోస్ట్ అవైటెడ్ వార్ 2లో న‌టించనుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇటీవ‌లే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముంబైలో వార్ 2 టీమ్ తో చేరాడు. హృతిక్- ఎన్టీఆర్ జోడీపై అదిరిపోయే సాంగ్ ని తెర‌కెక్కించ‌నున్నార‌ని, భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ని తెర‌కెక్కిస్తార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు ట్రిప్తి గురించి క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌వేళ ట్రిప్తి ఈ టీమ్ లో చేరినా కానీ, ఎవ‌రి స‌ర‌స‌న న‌టిస్తుంది? అన్న‌దానిపై క్లారిటీ రాలేదు.

ట్రిప్తి మ‌రోవైపు ప్ర‌భాస్- సందీప్ వంగా కాంబినేష‌న్ సినిమా స్పిరిట్ లోను న‌టించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ట్రిప్తి కోసం టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప‌లువురు క్యూలో ఉన్నారు. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయ‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. మ‌రోవైపు వార్ 2 చిత్రాన్ని య‌ష్ రాజ్ ఫిలింస్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోంది. ఈ చిత్రంలో ఇద్ద‌రు మించి అంద‌గ‌త్తెల‌తో అదిరిపోయే విన్యాసాలను వీక్షించే సౌల‌భ్యం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

కియ‌రా మ‌రో క‌థానాయిక‌:

జూన్‌లో కియారాను వార్ 2 టీమ్‌లోకి తీసుకువచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. YRF స్పై యూనివర్స్ కీల‌క చిత్రం `వార్ 2` బృందంలోకి కియారా అద్వానీ చేర‌గానే ఎన్టీఆర్ స‌ర‌స‌న ఈ భామ న‌టిస్తుంద‌ని ఊహాగానాలు సాగాయి. కానీ దానిపై స‌రైన క్లారిటీ లేదు. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ వంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చే ప్రతి సినిమాపైనా అంచనాలను పెంచాయి. వైఆర్ఎప్ స్పై యూనివ‌ర్శ్.. దేశంలోని అతిపెద్ద, అత్యుత్తమ సూపర్‌స్టార్‌లతో రూపొందుతున్న భారీ యూనివ‌ర్శ్ గా పాపుల‌రైంది.