Begin typing your search above and press return to search.

వార్ 2.. ఎన్టీఆర్ కోసం ఆ క్యూట్ పిల్ల?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెర పైకి రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే రూపొందుతోంది

By:  Tupaki Desk   |   18 Nov 2023 9:56 AM GMT
వార్ 2.. ఎన్టీఆర్ కోసం ఆ క్యూట్ పిల్ల?
X

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెర పైకి రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే రూపొందుతోంది. రెండు భాగాలుగా దర్శకుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే దేవర సినిమా ఫినిష్ కాకముందే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్టు ను స్టార్ట్ చేయబోతున్నాడు.

స్పై యూనివర్స్ లో భాగమైనటువంటి వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఒక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది గెస్ట్ రోల్ కాకుండా హీరో స్థాయికి తగ్గట్టుగా ఉండే రోల్ అని తెలుస్తుంది. అంతే కాకుండా ఆ పాత్రలో కాస్త నెగటివ్ షెడ్ కూడా ఉండబోతుందట. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కు అసలు హీరోయిన్ ఉంటుందా లేదా అనే డౌట్స్ చాలా మందిలో కలిగాయి.

ఇక దర్శకుడు రీసెంట్ గా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా ఒక బ్యూటీని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా ఆ బ్యూటీకి ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇక ఆమె ఎవరు అనే వివరాల్లోకి వెళితే.. ఆ బ్యూటీ పేరు శార్వరి వాఘ్. బాలీవుడ్ లో బంటీ ఔర్ బబ్లీ 2 వెండితెరకు పరిచయం అయ్యింది.

అంతే కాకుండా డెబ్యూ అఫ్ ది ఇయర్ గా ఐఫా అవార్డు సొంతం చేసుకుంది. ఇక మహారాజా షూటింగ్ పూర్తి చేసుకోగా మరో సినిమా వేదా నిర్మాణ దశలో ఉంది. వెబ్ సిరీస్ ది ఫర్గెటన్ ఆర్మీ ఆజాదీ కె లియేలో కూడా అమ్మడు ప్రధాన పాత్ర పోషించింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన శార్వరి మొదట మోడల్ గా గుర్తింపు అందుకొని ఆ తరువాత గ్లామరస్ బ్యూటీగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.

ఇక అమ్మడు మొదట్లోనే సక్సెస్ అందుకొని తనకు నచ్చిన మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక అమ్మడు వార్ 2 కోసం ఇటీవల యశ్ రాజ్ ఫిలిమ్స్ ను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం అమ్మడి పేరును మొదటి అప్షన్ గా అనుకుంటున్నారట. ఒకే అయితే త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.