Begin typing your search above and press return to search.

వార్ 2.. ఇది మరో లీక్?

ఈ సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని చాలా కాలం నుంచి ప్రచారం నడుస్తోంది. అది వాస్తవమే అనే టాక్ వినిపిస్తోంది.విలన్ గా కనిపిస్తే ఆడియెన్స్ ఒప్పుకోరని తారక్ కు కూడా తెలుసు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:19 AM GMT
వార్ 2.. ఇది మరో లీక్?
X

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ రెండు భాగాలుగా సిద్ధం అవుతోంది. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ 2లో నటించబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఈ మూవీలో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

అయాన్ ముఖర్జీ ఏరికోరి మరీ ఆ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ ని ఎంపిక చేసుకున్నారు. ఆయన కోసం షూటింగ్ షెడ్యూల్ కూడా వాయిదా వేశారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. హృతిక్ రోషన్ మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. తారక్ డేట్స్ కోసం చిత్ర యూనిట్ వెయిట్ చేస్తోంది. హృతిక్ రోషన్ కూడా గతంలో ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఈ సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని చాలా కాలం నుంచి ప్రచారం నడుస్తోంది. అది వాస్తవమే అనే టాక్ వినిపిస్తోంది.విలన్ గా కనిపిస్తే ఆడియెన్స్ ఒప్పుకోరని తారక్ కు కూడా తెలుసు. ఇక అలాంటి హీరోను దర్శకుడు కూడా పూర్తి స్థాయిలో నెగిటివ్ గా చూపించారు. తారక్ పాత్ర విలన్ కు హీరోకు మధ్యలో ఉండే ఒక చిన్న లైన్ మీద కొనసాగుతూ ఉంటుందట.

ధూమ్ సిరీస్ లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ పోషించిన పాత్రలు కూడా దాదాపు అలాంటివే. కానీ తారక్ విషయానికి వచ్చే సరికి సినిమాలో అతను ఓటమి చూడని పవర్ఫుల్ క్యారెక్టర్ తో కనిపిస్తారట. అలాగే తెలుగు స్టేట్స్ కి సంబంధించిన ఒక పాయింట్ కూడా సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కథ ఇంటర్నేషనల్ లెవెల్ మాఫియాకి కూడా సింక్ అయ్యి ఉంటుందట. మొదట పాజిటివ్ గా ఉన్నా ఆ తరువాత నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా అతని క్యారెక్టర్ వార్ 2 చిత్రంలో ఉండబోతోందని తెలుస్తోంది. కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ కి ఈ మూవీ మంచి బూస్టింగ్ అవుతుందని భావిస్తున్నారు.

యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. మూవీలో హృతిక్ రోషన్, తారక్ మధ్య డాన్స్ సీక్వెన్స్ కూడా ఉంటాయనే మాట వినిపిస్తోంది. ఇండియాలో బెస్ట్ డాన్స్ స్టార్స్ లో వీరిద్దరూ ఉంటారు. ఇద్దరు కలిసి స్క్రీన్ పై డాన్స్ చేస్తూ కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అని చెప్పాలి.

వార్ 2 కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాని తారక్ చేయనున్నాడు. ఆ మూవీ పీరియాడిక్ జోనర్ లో ఉండబోతోందనే ప్రచారం ఉంది. కథని కూడా హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ప్రశాంత్ నీల్ సిద్ధం చేసారంట.