Begin typing your search above and press return to search.

తారక్ 'వార్-2'.. స్ట్రాటజీ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్-2. ఆ సినిమాతోనే ఆయన బీ టౌన్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 July 2025 6:00 PM IST
తారక్ వార్-2.. స్ట్రాటజీ మామూలుగా లేదుగా!
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్-2. ఆ సినిమాతోనే ఆయన బీ టౌన్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ప్రతిష్టాత్మకంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లే. ఒక్క పాట చిత్రీకరణ ఇప్పుడు జరుగుతోంది. తారక్, హృతిక్.. ఇద్దరూ ఆ సాంగ్ లో కనిపించనున్నారు. ఓ రేంజ్ లో ఆ పాట ఉండనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్పెషల్ ఫోకస్ తో సాంగ్ ను సిద్ధం చేస్తున్నారని టాక్.

అదే సమయంలో రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులో కూడా సందడి చేయనున్న ఆ చిత్రాన్ని యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే మొత్తానికి వార్-2 మూవీని మేకర్స్ దాదాపు తొమ్మిది వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. దీంతో పుష్ప 2 కన్నా అతి పెద్ద రిలీజ్ వార్ 2కే దక్కనుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. దేశంలో ఉన్న ఐమ్యాక్స్ స్కీన్స్ లో ఎక్కువ శాతాన్ని ఇప్పటికే వార్ మేకర్స్ లాక్ చేశారని టాక్.

దీంతో ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ తనదైన స్ట్రాటజీతో స్క్రీన్ కౌంట్ పరంగా రజినీకాంత్ కూలీ మూవీతో పెద్ద ఎత్తున పోటీపడనుందని స్పష్టంగా అర్థమవుతోంది. అన్ని భాషల్లో సరైన పంపిణీదారులు ఎంచుకుని ఓ రేంజ్ లో సందడి చేయనుందని తెలుస్తోంది. అలా ఆగస్టు 14న కూలీ, వార్ -2 మధ్య పెద్ద క్లాష్ ఉండనుందని చెప్పాలి.

అయితే రెండూ భారీ సినిమాలే.. భారీ బడ్జెట్ తో రూపొందినవే.. మంచి హైప్ క్రియేట్ చేసుకున్నవే. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టనున్నాయని బయర్స్ అంచనా వేస్తున్నారు. రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమేనని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.. ఏ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో..