Begin typing your search above and press return to search.

వార్-2 అమెరికా టికెట్ రేట్లు.. హిందీ కన్నా తెలుగు వెర్షన్ కే ఎక్కువ..

కాగా.. ప్రీమియర్స్ కు గాను హిందీ వర్షన్ కంటే తెలుగు వర్షన్‌ కు 7- 8 డాలర్లు అధికంగా ధరలు నిర్ణయించారు మేకర్స్.

By:  Tupaki Desk   |   19 July 2025 12:08 PM IST
వార్-2 అమెరికా టికెట్ రేట్లు.. హిందీ కన్నా తెలుగు వెర్షన్ కే ఎక్కువ..
X

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న వార్-2 మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఆ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనున్నారు.

అయితే ఆగస్టు 14వ తేదీన సినిమా.. వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతున్న వార్-2 మూవీ ప్రీమియర్స్ ను ఆగస్టు 13వ తేదీన యూఎస్ లో వేస్తున్నారు మేకర్స్. అందుకు గాను ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. టికెట్ బుకింగ్స్ ఇటీవల స్టార్ట్ అయ్యాయి.

వాటి ధరల విషయానికొస్తే.. రెగ్యులర్ థియేటర్లలో హిందీ వర్షన్‌ టికెట్ కాస్ట్ 18 డాలర్లు ఉండగా, తెలుగు వెర్షన్ ధర 25 డాలర్లుగా ఉంది. PLFs లో హిందీ వర్షన్‌ టికెట్ ధర 22 డాలర్లుగా, తెలుగు వెర్షన్‌ కు 30 డాలర్లుగా ఫిక్స్ చేశారు. ఐమాక్స్, 4DX ఫార్మాట్‌ లో హిందీ వర్షన్‌ కు 27 డాలర్లు, తెలుగు వర్షన్‌ కు 35 డాలర్లు నిర్ణయించారు.

తమిళంలో యూఎస్ లో ప్రీమియర్స్ వేయడం లేదు. ఆ తర్వాత 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు.. తెలుగు వెర్షన్ కు గాను రెగ్యులర్ థియేటర్లలో 20 డాలర్లు, PLFs లో 24 డాలర్లు, ఐమాక్స్, 4DX ఫార్మాట్‌ లో 28 డాలర్లుగా టికెట్ ధరను నిర్ణయించారు. అదే రోజుల్లో సినిమా హిందీ, తమిళ వెర్షన్లకు థియేటర్ ప్రెస్ లనే డిసైడ్ చేశారు.

కాగా.. ప్రీమియర్స్ కు గాను హిందీ వర్షన్ కంటే తెలుగు వర్షన్‌ కు 7- 8 డాలర్లు అధికంగా ధరలు నిర్ణయించారు మేకర్స్. నార్త్ అమెరికాలో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో అలా చేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్.. దేవర ప్రీమియర్స్ తో అక్కడ 2 మిలియన్ డాలర్లను రాబట్టడం విశేషం.

ఇప్పుడు వార్-2 మూవీ చేస్తుందో చూడాలి. అయితే జూలై 23న వార్ 2 ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ స్పీడ్ పెంచనున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వేర్వేరుగా ప్రమోషన్స్‌ లో పాల్గొనేలా షెడ్యూల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ తర్వాత ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ప్రమోషన్స్ చేస్తారని సమాచారం.