Begin typing your search above and press return to search.

వార్ 2 టీజర్ ఎఫెక్ట్.. ఎన్టీఆర్ ఫీలింగ్ ఎలా ఉందంటే..?

ఇది ఓ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నమేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ట్రైలర్ రాకముందే ఎన్టీఆర్ ఇమేజ్‌ను పునరుద్ధరించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   23 May 2025 7:41 AM
వార్ 2 టీజర్ ఎఫెక్ట్.. ఎన్టీఆర్ ఫీలింగ్ ఎలా ఉందంటే..?
X

ఇటీవల విడుదలైన హిందీ మూవీ వార్ 2 టీజర్ తారక్ అభిమానుల కోరికల్ని పూర్తిగా తీరుస్తుందనుకున్నారు. హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ కాంబినేషన్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ఎన్టీఆర్ పుట్టినరోజున రిలీజ్ చేసిన టీజర్‌కు ఘన స్వాగతం లభిస్తుందని భావించారు. కానీ ఊహించిన దానికంటే భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌కి హిందీ ఆడియన్స్ నుంచి ఆశించినంత రెస్పాన్స్ రాలేదు.

పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో టీజర్‌ను ఓవర్ క్రిటిసైజ్ చేస్తూ ట్రోలింగ్ పెద్ద ఎత్తున సాగింది. ప్రత్యేకించి హిందీ బెల్ట్‌లోని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. యష్ రాజ్ ఫిలింస్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన టీజర్‌కు ఉండాల్సిన ప్రెజెంటేషన్ లేదు, విజువల్స్ మోతాదైన ఆకర్షణ కలిగించలేదు అన్న విమర్శలు వెల్లువెత్తాయి.

గతంలో ఇదే బ్యానర్ లో వచ్చిన స్పై యూనివర్స్ సినిమాలకు ఈ తరహా నెగిటివ్ వైబ్ కనిపించింది లేదు. కానీ చాలా కాలం పాటు ఊరించి ఊరించి విడుదల చేసిన మొదటి అప్డేట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో ఎలా ఉంటుందోనన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు ఎన్టీఆర్ టీమ్ స్పందనకు దిగింది.

ఓ ప్రెస్ నోట్ ద్వారా తారక్ పాత్రపై వారి నమ్మకాన్ని తెలియజేశారు. ఈ చిత్రంలో తాను నటించిన పాత్ర తనకు ప్రత్యేకమైన భావోద్వేగాన్నిచ్చిందనీ, ప్రతి ఫ్రేమ్‌లో తాను ప్రాణం పెట్టానని తెలియజేశారు. సినిమాలో తాను తీసుకున్న ప్రయాణం, పాత్రకు సంబంధించిన అంశాలు సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులకు అర్థమవుతుందని స్పష్టం చేశారు.

ఇది ఓ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నమేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ట్రైలర్ రాకముందే ఎన్టీఆర్ ఇమేజ్‌ను పునరుద్ధరించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన రియాక్షన్లు చూసిన తర్వాత ఈ ప్రయత్నం అవసరమయ్యిందనే వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. టీజర్‌లో నెగటివ్ టాక్ వస్తే, అది ఫిల్మ్ మీద ప్రభావం చూపనిది కాదు. ముఖ్యంగా హిందీలో ఎన్టీఆర్ తొలి అడుగు కావడం వల్ల ఈ టీజర్ మీదే భారీ ప్రెజర్ ఉండేది.

ఇప్పుడు వార్ 2 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా ట్రైలర్ రూపంలో సినిమాపై నమ్మకం కలిగించేలా బలమైన ప్రమోషన్లు అవసరం. ఎన్టీఆర్ పవర్‌ను తిరిగి చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం అయితే, టీజర్ వలన తారక్ మీద ఏర్పడిన నెగటివ్ వైబ్రేషన్‌ను తొలగించేందుకు ఆయన టీమ్ మెల్లగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇక రాబోయే అప్డేట్స్ కు ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉంటే బెటర్.