స్పై యూనివర్స్ ప్యాక్ రిపీట్.. వార్-2తో ఎలాంటి హిట్ కొడతారో?
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఆ యూనివర్స్ నుంచి ఇప్పటికే పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాయి.
By: Tupaki Desk | 20 May 2025 8:32 AMయష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఆ యూనివర్స్ నుంచి ఇప్పటికే పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాయి. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3.. స్పై యూనివర్స్ లో భాగంగా రూపొంది మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
ఇప్పుడు యష్ స్పై యూనివర్స్ లో భాగంగా వార్-2 సినిమా థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. నటించిన ఆ మూవీ ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. మేకర్స్ తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.
టీజర్ లో మన తారక్ పవర్ పుల్ గా కనిపించారు. నా గురించి తెలియదేమో.. ఇప్పుడు తెలుసుకుంటావ్.. గెట్ రెడీ ఫర్ ద వార్ అంటూ ఎన్టీఆర్ చెబుుతున్న డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచుతుంది. ఒక్కసారిగా అందరి దృష్టిని సినిమా వైపు తిప్పుకుంది టీజర్.
అదే సమయంలో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. స్పై యూనివర్స్ స్టారర్ ప్యాక్ మరోసారి రిపీట్ అయిందని నెటిజన్లు చెబుతున్నారు. సాధారణంగా యష్ స్పై యూనివర్స్ లోని సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. అవి దాదాపు అన్ని చిత్రాల్లో కనిపిస్తాయి. ఇప్పుడు వార్-2లో కూడా ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.
- సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తున్న ఇద్దరూ స్టార్ నటులు
- బికినీలో హీరోయిన్ గ్లామర్ షో
- బ్రిడ్జి పై నుంచి రైలు పైకి నటులు దూకే సీన్
- ఇద్దరు నటులు పారాచూట్‌లతో విమానం నుండి దూకే సన్నివేశం
- గాలిలోకి దూకి ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే సీన్
ఇప్పుడు వార్-2లో పైన చెప్పిన పాయింట్స్ అన్నీ ఉండనున్నట్లు టీజర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ స్టార్ నటులే. కాబట్టి మళ్లీ స్టారర్ ప్యాక్ రిపీట్ అయినట్లు ఉంది. ఇంతకుముందు స్పై యూనివర్స్ లో వచ్చిన పఠాన్, టైగర్ 3, వార్ లో కూడా సేమ్ సీన్స్ ఉన్నాయి. త్వరలోనే యూనివర్స్ నుంచి ఆల్ఫా మూవీ రానుంది. అందులో కూడా తమ స్టారర్ ప్యాక్ ను మేకర్స్ రిపీట్ చేస్తారేమో చూడాలి. మరి ఇప్పటికే వచ్చిన మూవీస్ హిట్ అవ్వగా.. ఇప్పుడు వార్-2ను ఆడియన్స్ ఎలా ఆదరిస్తారన్నది హాట్ టాపిక్. మరేం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.