Begin typing your search above and press return to search.

'వార్‌ 2' క్లైమాక్స్‌... ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే వార్త

ఎన్టీఆర్‌ మొదటి బాలీవుడ్‌ మూవీ 'వార్‌ 2' ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   1 Jun 2025 2:06 PM IST
వార్‌ 2 క్లైమాక్స్‌... ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే వార్త
X

ఎన్టీఆర్‌ మొదటి బాలీవుడ్‌ మూవీ 'వార్‌ 2' ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సూపర్ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న వార్‌ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగస్టు నెలలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉన్నా హృతిక్ రోషన్‌ గాయం కారణంగా ఆలస్యం అయింది. త్వరలోనే షూటింగ్‌ను పునః ప్రారంభించి ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ల కాంబోలో పాటను చిత్రీకరించబోతున్నారు. షూటింగ్‌ పెండ్డింగ్‌లో ఉన్నప్పటికీ ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఆసక్తికర అప్డేట్‌ వచ్చింది.

ఈ సినిమా క్లైమాక్స్‌ గురించి ఆసక్తికర విషయం హిందీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్‌ ను విజువల్‌ వండర్‌గా మార్చడం కోసం భారీ ఎత్తున విజువల్‌ ఎఫెక్ట్స్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వార్‌ 2 క్లైమాక్స్‌ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం ఆ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల కోసం వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. స్పై థ్రిల్లర్‌లకు యాక్షన్‌ సన్నివేశాలు కీలకం అనే విషయం తెల్సిందే. అందులో భాగంగా ఈ సినిమా కోసం భారీ వీఎఫ్ఎక్స్ ను వినియోగిస్తున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన బాలీవుడ్‌ స్పై థ్రిల్లర్స్‌తో పోల్చితే ఈ సినిమా చాలా స్పెషల్‌గా ఉంటుంది అంటూ మేకర్స్‌ చెబుతున్నారు. ఇటీవల వచ్చిన టీజర్‌ తో అభిమానులు నిరాశకు గురి అయ్యారు. సినిమాను అన్ని స్పై థ్రిల్లర్స్ మాదిరిగానే తీసినట్లుగా ట్రైలర్‌లో చూపించారు. అయితే సినిమా మాత్రం చాలా స్పెషల్‌గా ఉంటుందని, ఇతర సినిమాలతో పోల్చలేని విధంగా ఉంటుంది అంటూ బలంగా చెబుతున్నారు. అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా వార్‌ 2 ఉంటుందనే విశ్వాసంను మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. వార్‌ సూపర్‌ హిట్‌ నేపథ్యంలో వార్‌ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల విషయంలో ఆసక్తి నెలకొంది.

విడుదలకు ముస్తాభవుతున్న వార్‌ 2 సినిమా ఇంకా వారం రోజుల షూటింగ్‌ బ్యాలన్స్ ఉంది. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కాంబోలో ఒక పాటను షూట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ పాటలో హృతిక్‌, ఎన్టీఆర్‌లు పోటీ పడి మరీ డాన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాకి కియారా అద్వానీ సైతం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆమె బికినీ ట్రీట్‌ కచ్చితంగా యూత్‌కి ఓ రేంజ్‌లో కిక్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వార్‌ 2 సినిమా టీజర్‌ విడుదల తర్వాత కాస్త క్రేజ్ తగ్గింది అనే విమర్శలు వస్తున్నాయి. కానీ సినిమా విడుదల సమయంకు కచ్చితంగా మళ్లీ బజ్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి. హిందీలోనే కాకుండా తెలుగు, ఇతర సౌత్‌ భాషల్లోనూ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.